మార్కెట్లోకి స్పెషల్ సమ్మర్ డ్రింక్… మజ్జిగనే స్పెషల్ గా తీసుకొచ్చిన కంపెనీ!

వేసవి( Summer ) కావడంతో చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా వున్నాయి.అలా సరదాగా బయటకు వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి వుంది.

ఇలాంటప్పుడు ఒంట్లో చల్లదనాన్ని నిలుపుకోవడం కోసం పానీయాలు తాగడం తప్పనిసరి.ఒంట్లో వేడిని తగ్గించడానికి మజ్జిగ ( Butter Milk ) ఒక ఔషదంలాగా పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే.

అయితే నేటి దైనందిత జీవితం, పట్టణీకరణ వ్యవస్థలో ఎంత మంది ఇళ్లల్లో మజ్జిగ చేసుకుంటున్నారు అంటే ఒక ప్రస్నార్ధకమే.

అందుకే మనకు మార్కెట్లో కొన్ని కంపెనీలు మజ్జిగను విక్రయిస్తున్నాయి. """/" / ఈ క్రమంలోనే తాజాగా మన తెలంగాణ కేంద్రంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రీమియం డైరెక్ట్‌ టు కన్స్యూమర్‌ (డీ2సీ) డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌( Sid`s Farm ) నేడు మజ్జిగను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

సౌకర్యవంతమైన ప్యాకేజింగ్‌లో రాబోతున్న ఈ మజ్జిగ రీసైక్లిబల్‌ 200 మిల్లీ లీటర్ల ఫుడ్‌ గ్రేడ్‌ డిస్పోజల్‌ కప్పులలో ప్యాక్‌ చేయబడి వుంది.

20 రూపాయల ధరలో రిటైలర్ల వద్ద వీటిని అందిస్తున్నారు.అన్ని వర్గాల వారికీ ఇది ఈ ధర అందుబాటు ధరలో ఉండటంతో పాటుగా అన్ని వయసుల వారికీ ఇది ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.

"""/" / ఈ మజ్జిగ కావాలంటే హోమ్‌ డెలివరీ ఆప్షన్ కూడా వుంది.

హైదరాబాద్‌లో ఈ రోజు బుక్‌ చేసుకుంటే, ఆ తరువాత రోజు సిద్స్‌ ఫార్మ్‌ డీ2సీ ఛానెల్‌ ద్వారా దీనిని డెలివరీ చేస్తారు.

అంతేకాకుండా బెంగళూరులో ఇది నిర్ధేశిత ఈ-కామర్స్‌ సైట్స్ లో దొరుకుతుంది.సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.

''మా మజ్జిగ మిగిలిన సంస్థలకు భిన్నంగా ఉంటుంది.ఎందుకంటే మా పెరుగు, సహజసిద్ధమైన పదార్ధాలతో తయారు చేయబడుతుంది.

ఈ సమ్మర్‌లో శరీరాన్ని కూల్ గా ఉంచుకునేందుకు మంచి ఆప్షన్ ఇది.అంతేకాకుండా రీసైక్లిబల్‌ ప్యాకేజింగ్‌తో ఈ వేసవి పానీయం మీకు అందింస్తున్నాం" అని అన్నారు.

నాని రెండు సినిమాలతో హిట్ కొడతాడా..?