పంజాబ్ సీఎంతో.. సిద్దు బేటీ..!!

పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి.వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది.

విషయంలోకి వెళితే ఇప్పటికే అమరీందర్ సింగ్ కాంగ్రెస్ సీఎం పదవికి రాజీనామా చేయటం మాత్రమే కాక.

ఇటీవల బీజేపీ కీలక నేత అమిత్ షాతో భేటీ కావడం తెలిసిందే.ఆ తర్వాత ఆ పార్టీని వీడుతున్నట్లు కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది.

పీసీసీ పదవిని సిద్ధూకి కట్టబెట్టిన తర్వాత.అమరీందర్ సింగ్.

రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొని సోనియాగాంధీకి రాజీనామా పత్రాన్ని పంపటం ఆమె అంగీకరించడం జరిగింది.

ఇక ఇదే తరుణంలో పీసీసీ పదవికి కూడా రాజీనామా చేశారు.దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కి పెద్ద తలనొప్పి స్టార్ట్ అయింది.

పార్టీలో కీలక నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండటంతో.పార్టీ పెద్దలు మండిపడుతున్నారు.

ఇటువంటి తరుణంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్ జీత్ సింగ్ తో తాజాగా సిద్దు బేటీ కావటం పంజాబ్ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే కొన్ని డిమాండ్లను సీఎం ముందుకు సిద్ధూ తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు దీంతో పీసీసీ పదవిలో సిద్ధూ రాబోయే రోజుల్లో కొనసాగుతున్నట్లు ఎమ్మెల్యే గుర్ధిప్ సింగ్ చెప్పుకొచ్చారు.

సోమవారం క్యాబినెట్ మీటింగ్ జరగనున్న తరుణంలో సిద్ధూ తో సీఎం భేటీ కావడం పంజాబ్ రాజకీయాల్లో.

సంచలనంగా మారింది.

మా అమ్మ గురించి మీకేం తెలుసు.. పవిత్ర గౌడ కూతురు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!