ర‌ష్యా వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్‌.. ట్విస్ట్ ఏంటంటే?

కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి క‌రోనా వైర‌స్ ప్ర‌పంచదేశాల్లోనూ వేగంగా విజృంభిస్తూ.ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకున్న ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి నాశనం అయ్యే రోజులు ఎప్పుడు వ‌స్తాయో ఊహించ‌లేక‌పోతున్నారు.

వ్యాక్సిన్ వ‌స్తే క‌రోనా ముప్పు త‌గ్గుతుంద‌ని తేల‌డంతో.ప్ర‌పంచ‌దేశాల్లోనే క‌రోనా విరుగుడును క‌నుగొనే ప్ర‌యోగాలు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి.

అయితే ఇప్ప‌టికే రష్యా `స్పుత్నిక్ వీ` పేరుతో మొద‌టి క‌రోనా వ్యాక్సిన్‌ను విడుద‌ల చేసింది.

రష్యా గమాలియా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎపిడిమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు.

కానీ, ఇత‌ర దేశాలు ఈ వ్యాక్సిన్ భద్రతపై ప‌లు సందేహాలు వ్యక్త‌ప‌ర‌చ‌డంతో.మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేసింది.

అయితే ఈ క్రమంలోనే స్పుత్నిక్ వీ వ‌ల్ల స్వల్ప దుష్ప్రభావాలు తలెత్తాయనే విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా దాదాపు మూడు వంద‌ల‌ మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇవ్వ‌గా.

అందులో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు త‌లెత్తాయి.

ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.ఈ విష‌యాన్ని స్వ‌యంగా ర‌ష్యా ఆరోగ్య శాఖ మంత్రినే వెల్ల‌డించారు.

అంతేకాదు, స్పుత్నిక్ వీ వ‌ల్ల వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్ స‌ర్వ సాధార‌ణ‌మ‌ని.వీటిని మేము ముందే ఊహించామ‌ని చెప్పుకొచ్చారు.

మ‌రియు ఈ దుష్ప్రభావాలు రెండు లేదా మూడు రోజుల్లో త‌గ్గిపోతాయ‌ని చెప్పుకొచ్చారు.కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సిన్ రేసులో ముందున్న రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వీపై అంద‌రి చూపులు ఉన్నాయి.

కానీ, ఇలాంటి త‌రుణంలో స్పుత్నిక్ వీ వ‌ల్ల వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్ బ‌య‌ట‌ప‌డ‌టంతో.

అంద‌రూ నిరాశ‌కు గురైన‌ట్టు తెలుస్తోంది.

పవన్ కోసం రేణు ఇంత పెద్ద సినిమా నుంచి తప్పుకుందా ? బద్రి సినిమా తర్వాత ఏం జరిగింది ?