ల్యాప్‌టాప్‌పై ఎక్కువ సమయం పని చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు..!

ప్రస్తుత రోజులలో చాలామంది ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌( Desktop ) లపై ఎక్కువగా పని చేస్తూ సమయం గడుపుతున్నారు.

ఇది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ఆఫీసులోనైనా సరే కంప్యూటర్ కచ్చితంగా ఉండాల్సిందే.

వీటిపై ఎక్కువ సమయం పనిచేయడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

అంతేకాకుండా చేతులు, చేతి వేళ్లలో చాలా రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి.ఇలాంటి సమయంలో ఈ చిట్కాలను పాటించడం ఎంతో మంచిది.

"""/" / కొన్ని ముఖ్యమైన చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లని సరైన స్థానంలో ఉంచాలి.

లేదంటే శరీరక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.ల్యాప్‌టాప్‌ ను సులభంగా హాండిల్ చేయగలిగే ప్రదేశంలో ఉంచుకోవాలి.

టైప్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు.స్క్రీన్ దగ్గరగా ఉందని భావిస్తే కీబోర్డ్ స్క్రీన్ సర్దుబాటు( Keyboard Screen ) చేసుకోవడం ఎంతో ముఖ్యం.

అవసరమైతే ల్యాప్‌టాప్‌ కి అదనపు కీబోర్డ్ ను ఉపయోగించి పని చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఇంకా చెప్పాలంటే కొంతమందికి కీబోర్డ్ పై వేగంగా టైప్( Fast Typing ) చేసే అలవాటు ఉంటుంది.

దీని వల్ల ఆ పని తొందరగా పూర్తి అవుతుందని వారు భావిస్తారు.అయినప్పటికీ కొన్నిసార్లు దీనిని నివారించడం అవసరం.

ఎందుకంటే వేగంగా టైప్ చేయడం వల్ల వేళ్ళు, చేతులపై ఒత్తిడి పెరుగుతుంది.అందుకే నెమ్మదిగా టైప్ చేసుకోవడం మంచిది.

దీని వల్ల చేతులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. """/" / ఇంకా చెప్పాలంటే ల్యాప్‌టాప్‌, కంప్యూటర్ పై పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో విరామం( Rest ) తీసుకుంటూ ఉండాలి.

ఇది శరీర భాగాలకు విశ్రాంతిని ఇస్తుంది.ఒక పని పూర్తి అయిన తర్వాత చేతులను, వెళ్ళను సాగదీయాలి.

లేదంటే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.పని చేస్తున్నప్పుడు పిడికిలిని రెండు నుంచి నాలుగు సార్లు ముస్తు తెరుస్తూ ఉండాలి.

ఇలా వేళ్లు చేతుల పూర్తిగా విస్తరించడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

హమ్మయ్య .. మొత్తానికి దివాళీ ఎపిసోడ్ తో చిందులు వేయించారు