చేతులు కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు ఉప్పు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లే..!

ఆహారానికి రుచి అందించే వాటిలో ఉప్పు ముఖ్యమైనదని దాదాపు చాలామందికి తెలుసు.ఉప్పు తగ్గితే తినే ఆహార పదార్థం చాలామంది చప్పగా ఉంది అని చెబుతూ ఉంటారు.

ఉప్పు( Salt ) ఎక్కువగా ఉపయోగిస్తే జీవన కాలం తగ్గిపోతుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆహారం తినేటప్పుడు ఉప్పు డబ్బా ను దూరంగా పెట్టుకోమని కూడా పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే కూరలో కాస్త ఉప్పు తక్కువైనా కూడా వెంటనే ఉప్పు డబ్బా తీసి పైన చల్లుకొని తినేస్తుంటారు.

దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం ఉంది అని నిపుణులు చెబుతున్నారు.కొంతమంది తమకు తెలియకుండానే అధికంగా ఉప్పును తినేస్తూ ఉంటారు.

"""/" / బయట దొరికే ఆహారాలలో కూడా ఉప్పు అధికంగా ఉంటుంది.ఎక్కువ కాలం నిల్వ ఉండడం కోసం పచ్చళ్ళు , బ్రెడ్లు, సాస్లు వంటి వాటిలో అధికంగా ఉప్పును వేసి అమ్ముతూ ఉంటారు.

అయితే ఇలా దీర్ఘకాలంలో ఉప్పును అధికంగా తినడం వల్ల మీకు తెలియకుండానే శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి.

అవి దీర్ఘకాలంగా కొనసాగితే అనారోగ్యం బారిన పడడం ఖాయం అని నిపుణులు చెబుతున్నారు.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉంటుంది.ఆ నీరు కణజాలంలోకి చేరి అక్కడ వాపునకు కారణం అవుతుంది.

దీనివల్ల శరీరం ఉబ్బినట్లు కనిపిస్తుంది.అలాగే శరీరంలో అదనపు సోడియం( Excess Salt ) నిలిచిపోతుంది.

శరీరంలో ఉప్పు అధికంగా చేరిందంటే 24 గంటల్లో మీకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

అలాంటప్పుడు వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం మంచిది.సోడియం శరీరంలో అధికంగా చేరితే చేతులు, కాళ్లలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే పాదాలు మడమల్లో కూడా వాపులు వస్తాయి.దీన్నే ఎడెమా అని అంటారు.

ఎక్కువసేపు కూర్చున్న సుదీర్ఘ ప్రయాణం చేసిన ఇలా కాళ్లు చేతుల్లో వాపు రావడం సహజమే అని నిపుణులు చెబుతున్నారు.

"""/" / కానీ సాధారణ సమయంలో కూడా చేతులు, పాదాలలో మడమల్లో వాపు( Foot Swelling ) కనిపిస్తే మాత్రం మీరు ఉప్పు అధికంగా తీసుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.

ఇలా ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఉప్పు శరీరంలో అధికంగా చేరితే రాత్రి ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.

కిడ్నీలపై భారం పడుతుంది.మూత్రంతో పాటు పోషకాలు కూడా బయటకు వెళ్లిపోయే ప్రమాదముంది.

కాబట్టి ఉప్పును తక్కువగా తీసుకోవడమే మంచిది.

సాయి పల్లవి తో పాటు ఎక్కువ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న హీరోయిన్స్ వీరే !