వంట‌ల్లో టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారా.. అయితే ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి!

టేస్టింగ్ సాల్ట్( Tasting Salt ).దీని సాధార‌ణ పేరు మోనోసోడియం గ్లుటామేట్.

అజినోమోటో ( Ajinomoto )అనే పేరుతో టేస్టింగ్ సాల్ట్ ప్రముఖంగా ప్ర‌సిద్ధి చెందింది.

దీనిని వంటల్లో రుచిని మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తారు, ముఖ్యంగా చైనీస్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటుంది.

చైనా, జపాన్, కొరియా, ఇండియా, అమెరికా వంటి అనేక దేశాల్లో సురక్షితమైన ఫుడ్ యాడిటివ్ గా ఉపయోగించ‌బ‌డుతున్న‌ప్ప‌టికీ.

టేస్టింగ్ సాల్ట్ చుట్టూ చాలా వివాదాలే ఉన్నాయి.టేస్టింగ్ సాల్ట్ వాడ‌కం అనేక దుష్ప్రభావాలకు కారణమవుతుంది.

టేస్టింగ్ సాల్ట్ ను అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి, ఊబకాయానికి ( Weight Gain, Obesity )దోహదం చేయవచ్చు.

అలాగే టేస్టింగ్ ను సాల్ట్ అధిక వినియోగం కొంత‌మందిలో నరాలను ప్రభావితం చేయవచ్చు.

అజినోమోటో ఎక్కువ మోతాదులో హై బ్లడ్ ప్రెజర్ త‌లెత్తే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

టేస్టింగ్ సాల్ట్ ను వంట‌ల్లో అతిగా వాడితే మైగ్రెయిన్ ( Migraine )ట్రిగ్గర్ వ‌చ్చే ఛాన్సులు కూడా ఉంటాయి.

"""/" / టేస్టింగ్ సాల్ట్ అధిక వినియోగం వ‌ల్ల చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్ లేదా ఎమ్ఎస్‌జి సిండ్రోమ్ త‌లెత్త‌వ‌చ్చు.

తీవ్ర‌మైన తలనొప్పి, మైకం, అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం, మెడ లేదా ముఖం భాగంలో బ‌ర్నింగ్ సెన్సేష‌న్‌, జీర్ణ సంబంధ సమస్యలు, ముక్కు కార‌డం, తుమ్ములు, ఛాతీలో నొప్పి చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్ ల‌క్ష‌ణాలు.

"""/" / అంతేకాకుండా టేస్టింగ్ సాల్ట్ కలిపిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇతర రుచులు అస్స‌లు నచ్చవు.

పైగా జంతువులలో చేసిన అనేక అధ్యయనాల్లో టేస్టింగ్ సాల్ట్ అనేది కాలేయం, మెదడు, థైమస్ మరియు మూత్రపిండాలు వంటి వివిధ అవయవాలపై చెడు ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు గుర్తించారు.

కాబ‌ట్టి, వీలైనంత వ‌ర‌కు టేస్టింగ్ సాల్ట్ వినియోగాన్ని త‌గ్గించండి లేదా పూర్తిగా నివారించండి.

మ‌రీ ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలు, వయోజనులు, రక్తపోటు ఉన్నవారు టేస్టింగ్ సాల్ట్ క‌లిపిన ఆహారా ప‌దార్థాల‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.