రెగ్యుల‌ర్‌గా ప‌సుపు తీసుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

ప్ర‌తి భార‌తీయుడి వంటింట్లో ఉండే కామ‌న్ మసాలా దినుసు ప‌సుపు.దీనిని ఇప్పుడు కాదు.

పూర్వ కాలం నుంచి శుభ‌కార్యాల‌కు, వంట‌ల‌కు విరి విరిగా ఉప‌యోగిస్తున్నారు.అలాగే ఆరోగ్యానికి కూడా ప‌సుపు ఎంతో మేలు చేస్తుంది.

కాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్‌, పొటాషియం, జింక్‌, సోడియం, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు ప‌సుపులో ఉంటాయి.

అలాగే యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఏజెంట్ లక్ష‌ణాలు కూడా ప‌సుపులో ఉంటాయి.

అందుకే ప‌సుపును చాలా మంది రెగ్యుల‌ర్‌గా ఏదో ఒక రూపంలో తీసుకుంటారు.అయితే ప‌సుపు ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.

ప‌రిమితికి మించి తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ముఖ్యంగా ప‌సుపును అతిగా తీసుకుంటే.

గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం, కడుపు మంట‌, క‌డుపు పూత వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

ప‌సుపు రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుతుంద‌ని అంద‌రికీ తెలుసు.కానీ, అదే ప‌సుపును ఓవ‌ర్ తీసుకుంటే.

ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డి బ‌ల‌హీన ప‌డిపోతుంది.ప‌సుపును మోతాదు మించి తీసుకుంటే త‌ల‌నొప్పి, ఒత్తిడి వంటి స‌మ‌స్యలు ఏర్ప‌డతాయి.

ఒక్కోసారి మైగ్రేన్‌కు కూడా దారి తీస్తుంది. """/" / క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో ప‌సుపు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అలా అని ప‌సుపు అతిగా తీసుకుంటే మాత్రం.పెద్ద పేగు క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంది.

అంతేకాదు, ప‌సుపు మెతాదుకు మించి తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలో రాళ్లు, కాలేయ వ్యాధులు, ర‌క్త హీన‌త‌, పురుషుల్లో వీర్యకణాలు త‌గ్గిపోవ‌డం, అల‌ర్జీ ఇలా అనేక స‌మ‌స్యలు ఇబ్బంది పెడ‌తాయి.

కాబ‌ట్టి, ఇక‌పై ప‌సుపు విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండండి.పొర‌పాటున కూడా ప‌రిమితికి మించి తీసుకోకండి.

వైరల్: చనిపోయిన కుక్క కళేబరంతో పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తండ్రి.. కొడుకే చంపాడంటూ..