సోయాబీన్స్‌ను ఇలా తీసుకుంటే చాలా డేంజర్.. జాగ్రత్త!
TeluguStop.com
సోయాబీన్స్.వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బఠానీ జాతికి చెందిన సోయా బీన్స్‌తో రకరకాల రెసిపీస్‌ను తయారు చేసుకుని తీసుకుంటారు.
సోయా బీన్స్ రుచిగా ఉండటమే కాదు.కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి, ప్రోటీన్ వంటి పోషకాలెన్నిటినో కలిగి ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా సోయా బీన్స్ ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో జబ్బులను నివారిస్తాయి.
అయితే ఎంత మంచి చేసిప్పటికీ వీటిని అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం చాలా డేంజర్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి ఇంకెందుకు ఆలస్యం సోయా బీన్స్ ఓవర్‌గా ఎందుకు తీసుకోరాదు.? అసలు తీసుకుంటే ఏయే సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.సోయా బీన్స్‌ను అతిగా తీసుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది.
ఫలితంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, కడుపు నొప్పి, కడుపులో మంట వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ముప్ప తిప్పులు పెడతాయి.
"""/"/
సోయా బీన్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది.అందు వల్ల వీటిని పరిమితికి మించి తీసుకుంటే గనుక గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుందని అంటున్నారు నిపుణులు.
అలాగే సోయా బీన్స్‌ను అధిక పరిమాణంలో తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి.
అదే అధిక బరువు ఉన్న వారైతే సోయా బీన్స్‌ను చాలా అంటే చాలా లిమిట్‌గా తీసుకోవాలని అంటున్నారు.
ఇక సోయా బీన్స్‌ను ఓవర్‌గా తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, అతిసార, కడుపు తిమ్మిరి, చర్మ అలర్జీలు వంటి సమస్యలు సైతం తలెత్తుతాయి.
అందు కారణంగా.రుచిగా ఉన్నాయోనో లేక ఆరోగ్యానికి మంచిదనో చెప్పి సోయా బీన్స్ ను అతిగా మాత్రం తీసుకోకండి.
ఆక్సిజన్ మాస్క్ తో సినిమా షూటింగ్.. సమంత కష్టాలకు కన్నీళ్లు పెట్టిన హీరో?