టీవీ చూస్తూ నిద్రపోతున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!
TeluguStop.com
నిద్ర.శరీరానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రోజుకు సరిపడా నిద్రపోతేనే హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు.లేదంటే వివిధ రకాల జబ్బులకు చేరువవుతూ ఉంటారు.
అందుకే ఆరోగ్య నిపుణులు సైతం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రించాలని ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు.
అయితే నిద్ర విషయంలో కొందరికి ఉండే అతి పెద్ద చెడ్డ అలవాటు ఏంటంటే టీవీ చూస్తూ నిద్రపోవడం.
"""/" /
రోజంతా ఇంటి పనులతో, వంట పనులతో, ఆఫీస్ పనులతో అలసి పోయి రాత్రి అయ్యే సరికి టీవీ ముందు చక్కగా సేద దీరుతుంటారు.
ఈ క్రమంలోనే టీవీ చూస్తు చూస్తూనే నిద్ర పోతుంటారు.మళ్లీ ఐదు నిమిషాలకో, పది నిమిషాలకో మెలుకువ వస్తుంది.
పోని అప్పుడైనా టీవీ కట్టేసి బెడ్‌పైకి వెళ్లి పడుకుంటారా అంటే? అబ్బే.అలా అస్సలు చేయరు.
మళ్లీ కాసేపు టీవీ చూస్తారు, ఓ కనుకు నిద్ర తీస్తారు.ఇలానే గంటలు గడిచిపోతుంటాయి.
చివరకు అటు టీవీ చూడరు, ఇటు నిద్రా పోరు.ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది.
కానీ, ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా పాడుచేసుకుంటున్నట్టు అవుతుంది.
అవును, టీవీ చూస్తూ నిద్ర పోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
టీవీ చూస్తూ పడుకోవడం వల్ల.పదే పదే నిద్రకు ఆటంకం కలుగుతుంది.
దాంతో రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గి పోవడం, జీర్ణ వ్యవస్థ పని తీరు దెబ్బ తినడం వంటివి జరుగుతాయి.
"""/" /
అలాగే హార్మోన్ల అసమతుల్యత, నిద్ర లేమి, తల నొప్పి, చర్మం యొక్క నిగారింపు తగ్గిపోవడం ఇలా అనేక సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అందుకే ఇకపై టీవీ చూస్తూ నిద్రించే అలవాటును మానుకోండి.టీవీలే కాదు పడుకునే సమయంలో స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు సైతం దూరంగా ఉండాలి.
క్యారెట్ తో ఆరోగ్యమే కాదు జుట్టును కూడా పెంచుకోవచ్చు.. ఇంతకీ ఎలా వాడాలంటే?