ప్రోటీన్ షేక్స్ గురించి ఇవి తెలుసుకోపోతే చాలా న‌ష్ట‌పోతారు!

ఇటీవ‌ల రోజుల్లో చాలా మంది ప్రోటీన్ షేక్స్‌కు అల‌వాటు ప‌డుతున్నారు.ముఖ్యంగా బ‌రువు త‌గ్గ‌డానికి లేదా పెర‌గ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న వారు, కండ‌లు తిరిగిన దేహాన్ని పొందేందుకు ట్రై చేస్తున్న వారు త‌ప్ప‌ని స‌రిగా ప్రోటీన్ షేక్స్‌ను రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చు కుంటున్నారు.

అలాగే శ‌రీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచు కోవ‌డానికి కూడా వీటిని తీసుకుంటారు.అయితే ప్రోటీన్స్ షేక్స్ ఆరోగ్యానికి మేలు చేసిన‌ప్ప‌టికీ.

అతిగా తీసుకుంటే మాత్రం అనేక న‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.మ‌రి అల‌స్య‌మెందుకు ప్రోటీన్ షేక్స్ అధికంగా తీసుకుంటే ఏం అవుతుంది.

? ఎలాంటి న‌ష్టాలు ఎదురవుతాయి.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.

ప్రోటీన్స్ షేక్స్‌కు ర‌క్త‌పోటు స్థాయిల‌ను త‌గ్గించే సామ‌ర్థ్యం ఉంది.అందు వ‌ల్ల లోబీపీతో బాధ పడుతున్న వారు ప్రోటీన్స్ షేక్స్‌ను మోతాదుకు మించి తాగితే ర‌క్త పోటు స్థాయిలు మ‌రింత ప‌డిపోయి ప్రాణాలే రిస్క్‌లో ప‌డ‌తాయి.

అలాగే ప్రోటీన్ షేక్స్‌ను ఓవ‌ర్ గా  తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే న‌ష్టాల్లో డీహైడ్రేష‌న్ ఒక‌టి.

ప్రోటీన్ షేక్స్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ శాతంలో ఉంటాయి.అందు వ‌ల్లే, వాటిని ఓవ‌ర్‌గా తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది.

"""/" / ప్రోటీన్ షేక్స్ కిడ్నీల‌నూ తీవ్రంగా ప్ర‌భావితం చేస్తాయి.వీటిని ఎప్పుడైతే అధికంగా తీసుకుంటారో.

అప్పుడు కిడ్నీలు మరింత స‌మ‌యం శ్రమించాల్సి వస్తుంది.ఇదే క్ర‌మంగా కంటిన్యూ అయితే.

కిడ్నీల ప‌ని తీరే దెబ్బ తింటుంది.అతిగా ప్రోటీన్‌ షేక్స్‌ను తీసుకుంటే కాలేయ ఆరోగ్యమూ పాడ‌వు తుంది.

ముఖ్యంగా కాలేయ వాపు, మంట వంటి స‌మ‌స్యలు ఎదుర‌వుతాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

ఇక ప్రోటీన్ షేక్స్ ప‌రిమితికి మించి తీసుకుంటే మొటిమ‌ల స‌మ‌స్య సైతం త‌ర‌చూ ఇబ్బంది పెడుతుంది.

కాబ‌ట్టి, త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గాలి లేదా త్వ‌ర‌గా కండ‌లు పెంచాలి అనే అతి ఉత్సాహంతో ప్రోటీన్స్ షేక్స్‌ను ఓవ‌ర్‌గా తీసుకోవ‌ద్దు.

డేంజ‌ర్‌లో ప‌డ‌వ‌ద్దు.

ఆ రెండు రాజకీయ పార్టీల మధ్యలో నలిగిపోతున్న పుష్పరాజ్.. అసలేం జరిగిందంటే?