కమలాలు మంచివని అతిగా తింటే…ఈ సమస్యలు తప్పవు!
TeluguStop.com
కమలా పండ్లు.ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా కమలా పండ్లను తింటుంటారు.
కమలా పండులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే రుచిలోనే కాదు.ఆరోగ్య పరంగానూ మరియు సౌందర్య పరంగానూ కమలా పండ్లు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అయితే కొందరు కమలా పండ్లను రుచిగా ఉన్నాయనో లేదా హెల్త్‌కు మంచివనో ఓవర్‌గా తినేస్తుంటారు.
అయితే కమలా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.అతిగా తీసుకుంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కమలా పండ్లను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల.అందులో అత్యధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి.
కడుపు ఉబ్బరం, అతిసారం వంటి సమస్యలు ఏర్పడేలా చేస్తుంది. """/" /
అలాగే కమలా పండ్లను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
వాస్తవానికి కమలా పండ్లలో కేలరీలు తక్కువగానే ఉన్నప్పటికీ.ఎక్కువగా తీసుకుంటే కేలరీలు కూడా ఎక్కువై వెయిట్ గెయిన్ అయ్యేలా చేస్తుంది.
ఇక ఓవర్‌గా కమలా పండ్లను తీసుకోవడం వికారం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.
అంతేకాదు, కమలా పండ్లను అతిగా తీసుకుంటే.గుండెలో మంట కూడా ఏర్పడుతుంది.
అందువల్ల, కమలా పండ్లను అతిగా మాత్రం తీసుకోకండి.ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు.
అతిగా తీసుకుంటే ఏదైనా అనర్థమే.ఇందుకు కమలా పండ్లు కూడా ఏ మాత్రం మినహాయింపు కాదు.
కాబట్టి, కమలా పండ్లను రోజుకు ఒకటి మించి తీసుకోకపోవడమే మంచిది.
కూతుర్ని పైలట్‌ను చేసిన తండ్రి.. ఆయన కూడా పైలటే.. ఆమె ఫ్లైట్‌లోనే రిటైర్డ్!