చలువని సమ్మర్‌లో సబ్జా గింజలు తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!
TeluguStop.com
సమ్మర్( Summer ) సీజన్ లో చాలా మంది తమ రెగ్యులర్ డైట్ లో సబ్జా గింజలను( Basil Seeds ) చేర్చుకుంటూ ఉంటారు.
వేసవి వేడిలో బాడీకి సబ్జా గింజలు కూలింగ్ ఎఫెక్ట్‌ను ఇస్తాయి.తాపాన్ని తగ్గిస్తాయి.
శరీరానికి తేమను అందించి డీహైడ్రేషన్ నుంచి రక్షణ కల్పిస్తాయి.అందుకే సబ్జా గింజలను నానబెట్టి లెమన్ వాటర్‌లో, జ్యూసుల్లో, మజ్జిగలో లేదా నార్మల్ వాటర్ లోనైనా కలిపి తీసుకుంటారు.
మీరు కూడా చలువని సమ్మర్‌లో సబ్జా గింజలు తీసుకుంటున్నారా.అయితే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సబ్జా గింజలు ఆరోగ్యకరమే అయినప్పటికీ.వాటిని అధికంగా తీసుకుంటే మాత్రం పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా లో-బీపీ ఉన్న వారు సబ్జా గింజలను చాలా మితంగా తీసుకోవాలి.ఎందుకంటే, సబ్జా గింజలు రక్తపోటును ( Blood Pressure ) తగ్గించే స్వభావం ఉంటాయి.
ఈ గింజలను ఎక్కువగా తీసుకుంటే లో-బీపీ సమస్య మరింత తీవ్రంగా మారొచ్చు. """/" /
అలాగే సబ్జా గింజలను అతిగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది.
దాంతో పొట్టలో నొప్పి, అసౌకర్యం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.సబ్జా గింజలు నీళ్లు పీల్చుకుని పెద్దవి అవుతాయి.
అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే పొట్టలో గ్యాస్, ఉబ్బరం కలగొచ్చు.అధిక మోతాదులో సబ్జా గింజలను తీసుకుంటే కొందరికి వాంతులు లేదా మలబద్ధకం సమస్యలు ఎదురవుతాయి.
"""/" /
ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండాలి అనుకుంటే సబ్జా గింజలను మితంగా తీసుకోండి.
సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు ఒక టీస్పూన్ సబ్జా గింజలను తీసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా తీసుకోవడం వల్ల అందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.సబ్జా గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి నిగారింపు ఇస్తాయి.
జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి.ఫ్లావనాయిడ్లు, విటమిన్ ఎ లాంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బరువు తగ్గాలనుకునేవారికి, మధుమేహం ఉన్నవారికి కూడా సబ్జా గింజలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.