నిద్ర సమయాన్ని వృధా చేయడం వల్ల ఎన్ని అనర్థాలో తెలుసా..?
TeluguStop.com
ఆరోగ్యమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్ర( Sleep ) అంతకన్నా ముఖ్యం.
కానీ ప్రస్తుత రోజుల్లో నిద్ర సమయాన్ని వృధా చేస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది.
రాత్రుళ్లు పడుకోవడం మానేసి టీవీలు చూడటం, స్మార్ట్ ఫోన్ లో మునిగిపోవడం, పార్టీలు పబ్బులు అంటూ తిరగడం చేస్తున్నారు.
ఫలితంగా జబ్బుల బారిన పడుతున్నారు.నిద్ర కొరత కారణంగా జరిగే అనర్ధాలు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి.
నిద్ర సమయాన్ని వృధా చేయడం వల్ల మెదడు( Brain ) పని తీరు తగ్గిపోతుంది.
ఏకాగ్రత, ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి నెమ్మదిస్తాయి.భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోతారు.
తలనొప్పి చికాకు తీవ్రంగా వేధిస్తాయి.అలాగే నిద్ర తగ్గినప్పుడు ఆకలిని నియంత్రించే, పొట్ట నిండిన భావనకు గురి చేసే హార్మోన్లు అదుపు తప్పుతాయి.
దాంతో అతిగా తినడం ప్రారంభిస్తారు.ఫలితంగా బరువు పెరుగుతారు.
"""/" /
కంటి నిండా లేకపోవడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు( Heart Disease, High Blood Pressure ) మరియు స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.
నిద్రను నిర్లక్ష్యంగా చేస్తే ఒత్తిడి పెరుగుతుంది.డిప్రెషన్, ఆందోళన మరియు సైకోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
అలాగే నిద్రలేమి వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.ఫలితంగా శరీరం అనారోగ్యంతో పోరాడటం కష్టతరం చేస్తుంది.
మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతారు మరియు కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. """/" /
కంటి నిండా నిద్ర పోకపోవడం వల్ల రొమ్ము, కొలొరెక్టల్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.
నిద్ర సమయాన్ని వేస్ట్ చేస్తే.డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు ప్రమాదాలు మరియు గాయాల అయ్యే అవకాశాలు ఉంటాయి.
అంతేకాకుండా, నిద్రలేమి మూత్రపిండాల వ్యాధి, ఊబకాయం మరియు చిత్తవైకల్యం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
కాబట్టి ఇక నుంచి అయినా నిద్రను నిర్లక్ష్యం చేయడం మానుకోండి.నిత్యం రాత్రుళ్ళు ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి.
మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
టీ, కాఫీలకు బదులు డైలీ మార్నింగ్ ఈ డ్రింక్ ను తాగితే వెయిట్ లాస్ గ్యారెంటీ!