పంటలకు అధిక మోతాదులో యురియా వాడుతున్నారా..జరిగే తీవ్ర నష్టాలు ఇవే..!

సాధారణంగా రైతులు పంటకు ( Crop ) సిఫార్సు చేసిన దానికంటే అధిక మోతాదులో ఎరువులు అందిస్తే పంట దిగుబడి అధికంగా ఉంటుందని భావించి, అనవసరంగా అధిక ఎరువులు పొలంలో వేస్తే తీవ్ర నష్టం ఎదుర్కోవలసి వస్తుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

మొక్కల పెరుగుదల కోసం చాలామంది రైతులు అధిక మోతాదులో యూరియాను( Urea ) ఉపయోగిస్తుంటారు.

యూరియా అంటే నత్రజని కలిగిన ఒక ఎరువు.అమ్మోనియా, కార్బన్ డయాక్సైడ్ నుండి యూరియా తయారవుతుంది.

ఇందులో నత్రజని శాతం చాలా ఎక్కువ.పంటలకు నత్రజని చాలా అవసరం.

సరైన మోతాదులో ఉపయోగిస్తే పంట దిగుబడి పెరుగుతుంది. """/" / ఒకవేళ మోతాదుకు మించి యూరియాను ఉపయోగిస్తే కలిగే నష్టాలు ఏమిటో చూద్దాం.

మోతాదుకు మించి యూరియాను ఉపయోగిస్తే నేల సారవంతం( Soil Fertility ) తగ్గిపోతుంది.

నేలలో సేంద్రియ పదార్థం తగ్గుతుంది.మొక్కకు కావలసిన పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది.

అంతే కాదు నేలలో సూక్ష్మ పోషక లోపాలు అధికం అవుతాయి.మోతాదుకు మించి యూరియా వెయ్యడం వల్ల పంట ఏపుగా పెరిగి చీడపీడల ఉధృతి అధికం అయ్యే అవకాశం ఉంది.

"""/" / భూగర్భ జలాలు( Underground Water ) నైట్రేట్ నత్రజనితో కలుషితం అవుతాయి.

నేలలో సూక్ష్మజీవుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది.యూరియాలో ఆమ్ల స్వభావం ఎక్కువ.

కాబట్టి ఎక్కువగా యూరియా వాడితే నేలలు ఆమ్లా నేలలుగా మారే ప్రమాదం ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే మోతాదుకు మించి యూరియాను పొలంలో వేస్తే.నేల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.

పంట నాణ్యత కూడా బాగా తగ్గుతుంది.కాబట్టి సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియాను ఉపయోగించాలి.

యూరియా ధర తక్కువ కాబట్టి అధిక మోతాదులో ఉపయోగిస్తే అధిక దిగుబడి వస్తుంది అని అనుకోవడం పొరపాటు.

వ్యవసాయంలో ఏ పంట కైనా అన్ని సిఫార్సు చేసిన మోతాదు మేరకే ఉపయోగించాలి.

హలో లేడీస్.. లాంగ్ హెయిర్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ సీరం మీకోసమే!