తరచూ హెయిర్ డై వేసుకుంటున్నారా? అయితే మీ లైఫ్ రిస్క్‌లో పడ్డట్టే!
TeluguStop.com
నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది హెయిర్ డై వేసుకుంటున్నారు.
వేలకు వేలు ఖర్చు పెట్టి నల్లటి కురులకు రకరకాల రంగులు అద్దడం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్‌గా మారిపోయింది.
అయితే హెయిర్ డై వేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తినడం, నిర్జీవంగా మారడమే కాదు.
మీ లైఫే రిస్క్‌లో పడుతుంది.అవును, తరచూ హెయిర్ డై వేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆ ఆనారోగ్య సమస్యలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.మార్కెట్లో దొరుకుతున్న డైలలో జుట్టుకే కాదు ఆరోగ్యానికి హాని కలింగించే రసాయనాలూ చాలా అధికంగా ఉంటాయి.
అందుకే వీటిని తరచూ వాడితే నానా రోగాలు చుట్టేస్తాయి.ముఖ్యంగా హెయిర్ డై ధీర్ఘకాలికంగా వాడితే మూత్రాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా అధికంగా ఉంటుంది.
హెయిర్ డైలలో ఉండే కొన్ని కొన్ని కెమికల్స్ శ్వాస సంబంధిత సమస్యలనూ తెచ్చి పెడతాయి.
ముఖ్యంగా ఆస్తమా, శ్వాస సరగ్గా అందక పోవడం, శ్వాస కోశలో అడ్డంకులు ఇలా రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి.
"""/"/
అలాగే తరచూ హెయిర్ డై వేసుకోవడం వల్ల మూత్ర పిండాలు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది.
కొందరు చర్మ సంబంధిత సమస్యలు, కంటి సంబంధిత సమస్యలు కూడా వస్తుంటాయి.అందుకే హెయిర్ డైలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఇక గర్భం దాల్చిన స్త్రీలు హెయిర్ డై వేసుకుంటే.ఆ ప్రభావం కడుపులో బిడ్డ ఎదుగు దలపై తీవ్రంగా పడుతుంది.
కాబట్టి, గర్భిణీ స్త్రీలు ఫ్యాషన్ పేరుతో జుట్టుకు రంగులు వేసుకోవడం వంటివి ఎట్టిపరిస్థితుల్లో చేయరాదు.
వైరల్ వీడియో: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డ్యాన్స్ తో సందడి చేసిన కలెక్టర్