గుడ్లను ఇలా తింటే హెల్త్‌కు డేంజ‌ర‌ట‌..జాగ్ర‌త్త‌?

పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ తిన‌గ‌లిగే ఆహారాల్లో గుడ్డు ఒక‌టి.

సంపూర్ణ పోషకాహారమైన గుడ్డును ఉడికించుకుని, ఆమ్లెట్ వేసుకుని, ఫ్రై చేసుకుని, క‌ర్రీ వండుకుని ఇలా ర‌క‌ర‌కాలుగా తింటుంటారు.

ఎలా తిన్నా గుడ్డు రుచి అద్భుతంగా ఉంటుంది.అలాగే విట‌మిన్ ఎ, విటమిన్ బి, విట‌మిన్ సి , ప్రోటీన్‌, ఫోలిక్ యాసిడ్, ఇనుము, జింక్, సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు గుడ్డులో ఉంటాయి.

అందుకే గుడ్డు ఆరోగ్యానికి వెర్రీ గుడ్ అని అంటారు.గుడ్డు ఆరోగ్యానికి మంచిదే.

అయిన‌ప్ప‌టికీ అతిగా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది.ముఖ్యంగా గుడ్డులో బోలెడ‌న్ని పోషకాల‌తో పాటు కొలెస్ట్రాల్ కూడా అధికంగా ఉంటుంది.

అందువ‌ల్ల‌, గుడ్లు అధికంగా తీసుకుంటే శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ పెరుడుతుంది.

"""/" / ప‌రిమితికి మించి గుడ్ల‌ను తీసుకుంటే గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, ఎసిడిటీ వంటి జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉంటాయి.

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా నెమ్మ‌దిస్తుంది.వ‌య‌సు పైబ‌డిన వారిలో ఈ స‌మ‌స్య మ‌రింత అధికంగా ఉంటుంది.

అందుకే పిల్లలు, యువకులు రోజుకు రెండు గుడ్ల వ‌ర‌కు తీసుకోవాలి.న‌ల‌బై ఏళ్లు దాటిన వారు మాత్రం రోజుకు ఒక గుడ్డుకు మించకుండా తినాలి.

అలాగే సరిగా ఉడకని లేదా పచ్చి గుడ్లను ఎప్పుడూ తిన‌ కూడ‌దు.ఎందుకంటే, వీటి వ‌ల్ల ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది.

కాబ‌ట్టి, ప‌చ్చి గుడ్డు తిన‌డం, ఉడికీ ఉడ‌క‌ని గుడ్డు తిన‌డం చేయ‌కండి. """/" / మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు పూర్తి గుడ్డు తిన‌డం చాలా డేంజ‌ర్‌.

వీరు కేవ‌లం తెల్ల సొన‌ మాత్రమే తీసుకోవాలి.ప‌చ్చ సొన వ‌ల్ల మ‌ధుమేహం రోగుల్లో ఎల‌ర్జీ మ‌రియు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి.

రిజ్వాన్‌ని ఇంత దారుణంగా అవమానించాలా.. పాకిస్థానీ యాంకర్ చేసిన పనికి షాక్..