జీడిప‌ప్పును ఇలా తింటే తిప్ప‌లు త‌ప్ప‌వు.. జాగ్ర‌త్త‌!

చాలా మంది ఇష్టంగా తినే న‌ట్స్‌లో జీడిప‌ప్పు ముందుంటుంది.పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు జీడిప‌ప్పును అమితంగా ఇష్ట‌ప‌డుతుంటారు.

ఇక మ‌న భార‌తీయ వంట‌ల్లోనూ జీడిప‌ప్పు వినియోగం ఎక్కువే అన‌డంలో సందేహం లేదు.

అటు స్వీట్స్‌, ఇటు హాట్స్ రెండిటిలోనూ జీడిప‌ప్పును విరి విరిగా వినియోగిస్తుంటారు.ఇక ఆరోగ్య ప‌రంగా మ‌రియు సౌంద‌ర్య ప‌రంగా కూడా జీడిప‌ప్పు ఎంతో మేలు చేస్తుంది.

అయితే ఎన్ని విధాలుగా ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.జీడిప‌ప్పును అతిగా తింటే మాత్రం అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మ‌రి ఆ స‌మ‌స్య‌లు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ఎన్నో పోష‌క విలువ‌లు దాగి ఉన్న జీడిప‌ప్పులో ఫ్యాట్స్ కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.

ఈ ఫ్యాట్స్ ఆరోగ్యానికి మంచిదే.కానీ, అతిగా జీడిప‌ప్పు తీసుకుంటే.

అందులో ఉండే ఫ్యాట్సే మ‌న‌ ఆరోగ్యానికి చేటు చేస్తాయి.ముఖ్యంగా జీడిప‌ప్పును అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు నిల్వ‌లు పెరిగిపోతాయి.

దాంతో అధిక బ‌రువు స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. """/" / అలాగే జీడిపప్పు అధిక ఆక్సలేట్ కంటెంట్ ఉంటుంది.

కాబ‌ట్టి, జీడిప‌ప్పును మోతాదు మించి తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలో రాళ్లు ఏర్ప‌డ‌టం లేదా కిడ్ని డ్యామేజ్ వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

ఇక జీడిప‌ప్పును ఓవ‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది.ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.

గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు పెరిగిపోతాయి.

ఇక అతిగా జీడిప‌ప్పు తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులో ఉండే కొవ్వు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరును మంద‌గించేలా చేస్తుంది.

ఫ‌లితంగా.గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అలాగే ప‌రిమితికి మించి జీడిప‌ప్పు తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త పోటు పోరిగే అవ‌కాశం కూడా ఉంది.

కాబ‌ట్టి, ఎప్పుడూ కూడా జీడిప‌ప్పును అతిగా తీసుకోకండి.కేవ‌లం జీడిప‌ప్పునే కాదు.

ఇత‌ర ఏ ఆహారం అయినా అతిగా తీసుకుంటే అనేక స‌మ‌స్య‌ల‌నే ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

హరిహర వీరమల్లు తో విసిగిపోయిన క్రిష్ ఏం చేస్తున్నాడో తెలుసా..?