మొలకెత్తిన విత్తనాలను ఆ టైమ్‌లో తింటే చాలా డేంజరట..జాగ్రత్త!
TeluguStop.com

ఇటీవల కాలంలో హెల్త్, ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్న వారందరూ తమ డైట్‌లో ఖచ్చితంగా మొలకెత్తిన విత్తనాలను ఉండేలా చూసుకుంటున్నారు.


ఎందుకంటే మొలకెత్తిన విత్తనాలు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.


ముఖ్యంగా బరువును అదుపులో ఉంచడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా మార్చడంలోనూ, శరీరంలో పోషకాల కొరత ఏర్పడకుండా అడ్డు కట్ట వేయడంలోనూ, జీర్ణ క్రియ చురుగ్గా మారేలా ప్రోత్సహించడంలోనూ, క్యాన్సర్ కణాలు వృద్ధి చెంద కుండా చూడటంలోనూ, రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలోనూ.
అబ్బో ఇలా చెప్పు కుంటూ పోతే అనేక విధాలుగా మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
అయితే హెల్త్‌కి ఎంత మేలు చేసినప్పటికీ.ఖాళీ కడుపుతో ఉన్న సమయంలో మాత్రం మొలకెత్తిన విత్తనాలను తిన కూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పచ్చి మొలకలలో హాని కరమైన బ్యాక్టిరియా ఉంటుంది.అందు వల్ల, ఖాళీ కడుపుతో వీటిని తింటే గనుక ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
"""/" /
అందులోనూ పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు పరగడుపున మొలకెత్తిన విత్తనాలు తీసుకుంటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండటం, వాంతులు, అతి సారం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అందు వల్లనే, ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతో మొలకెత్తిన విత్తనాలను తీసుకో రాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఒక వేళ తప్ప కుండా తినాలీ అనుకుంటే మొలకెత్తిన విత్తనాలను పచ్చిగా కాకుండా.
ఒక ప్యాన్ లో కొద్దిగా అయిల్ వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు వేయించుకుని తీసుకోవాలి.
లేదా వాటర్‌లో కొద్దిగా ఉప్పు కలిపి.అందులో మొలకెత్తిన విత్తనాలను కాసేపు ఉడికించి ఆపై తీసుకోవాలి.
ఇలా చేస్తే మొలకెత్తిన విత్తనాల్లో ఉండే బ్యాక్టిరియా నాశనం అవుతుంది.