బ‌ల‌పాలు తింటున్నారా..అయితే ఈ తిప్ప‌లు త‌ప్ప‌వు!

బ‌ల‌పాలు.వీటి గురించి అస్స‌లు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

రాయ‌డానికి ఉప‌యోగించే బ‌ల‌పాల‌ను చిన్న పిల్ల‌లు తిన‌డం చాలా కామ‌న్‌.పెద్ద‌ల్లో సైతం బ‌ల‌పాలు తినే అల‌వాటు ఉంటుంది.

ఇక కొంద‌రు గ‌ర్భ‌వ‌తులైతే బ‌ల‌పాల వాస‌న చూడ‌గానే.వాటిని తెగ లాగించేస్తుంటారు.

బ‌ల‌పాలు పెద్ద విష పదార్ధం కాదు.అయిన‌ప్ప‌టికీ, వీటిని తిన‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

బ‌ల‌పాల‌ను శుద్ధ‌మైన శున్నంతో చేయ‌రు.అందు వ‌ల్ల బ‌ల‌పాలు తింటే.

ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.మ‌రి ఆ స‌మ‌స్య‌లు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌తి రోజు బ‌ల‌పాలు తిన‌డం వ‌ల్ల‌.దంతాలు డ్యామేజ్ అవ్వ‌డం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

దంతాలు పుచ్చిపోవ‌డం, దంతాలు బ‌ల‌హీన ప‌డ‌టం ఇలా బ‌ల‌పాల వ‌ల్ల అనేక దంత సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

అలాగే బ‌ల‌పాల త‌యారీలో కొన్ని ర‌కాల కెమిక‌ల్స్ కూడా వాడ‌తారు.అందువ‌ల్ల త‌ర‌చూ బ‌ల‌పాలు తీసుకుంటే.

జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.ముఖ్యంగా కుడుపు నొప్పి, అజీర్తి, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయి.

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా దెబ్బ తింటుంది.ఇక బ‌ల‌పాలు త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఆక‌లి మంద‌గించేస్తుంది.

దాంతో తినడం మానేస్తుంది.ఫ‌లితంగా శ‌రీరానికి త‌గిన పోష‌క‌లు అంద‌క‌.

అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.అలాగే బ‌ల‌పాలు తినే వారిలో నులి పురుగుల స‌మ‌స్య కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది.

ఇక గ‌ర్భ‌వ‌తులు బ‌ల‌పాలు తింటే.వారిలో పోష‌కాల కొర‌త‌, ర‌క్త హీన‌త‌, నీర‌సం ఇలా అనేక స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

మ‌రియు పుట్ట‌బోయే పిల్ల‌లు కూడా ఎఫెక్ట్ అవుతాయి.అందు వ‌ల్ల‌, బ‌ల‌పాల‌కు ఎంత దూరం ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది.

మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా ఆ పండుగను టార్గెట్ చేశారా?