హెల్త్‌కి మేల‌ని ఉల్లిని అతిగా తింటే తిప్ప‌లు త‌ప్ప‌వు..!

ఉల్లిపాయ‌.ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధికంగా వినియోగించే వెజిటేబుల్ ఇది.

దాదాపు ఏ కూర‌ అయినా ఉల్లిపాయ లేనిదే అసంపూర్ణం.ఇక కోసేట‌ప్పుడు క‌న్నీళ్లు పెట్టించినా.

ఉల్లిలో ఉండే విట‌మిన్ సి, విట‌మిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, ఐర‌న్‌, కాల్షియం, సోడియం, ఫైబ‌ర్, శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ బాక్టీరియల్ మ‌రియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఎన్నో జ‌బ్బుల‌ను సైతం నివారిస్తాయి.అందుకే ఉల్లి పాయ చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌ద‌ని అంటుంటారు.

అయితే గుర్తు పెట్టు కోవాల్సిన విష‌యం ఏంటంటే.ఆరోగ్యానికి ఎంత మంచి చేసి న‌ప్ప‌టికీ, ఎన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందించిన‌ప్ప‌టికీ ఉల్లిపాయను అతిగా తింటే మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌వు.

అవును, ప‌రిమితికి మించి ఉల్లిని తీసుకుంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

మ‌రి ఇంకెందుకు ఆ స‌మ‌స్య‌లేంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి. """/"/ సాధార‌ణంగా కొంద‌రు హెల్త్‌కి మేల‌నో లేదా టేస్టీగా ఉన్నాయ‌నో ప‌చ్చి ఉల్లిని తెగ తింటుంటారు.

ప‌చ్చి ఉల్లిని తిన‌డం త‌ప్పేమి కాదు.కానీ, అతిగా తింటే మాత్రం క‌డుపు నొప్పి, క‌డుపు ఉబ్బ‌రం, వికారం, వాంతులు అవ్వ‌డం, త‌ల తిర‌గ‌డం, క‌డుపులో తీవ్రమైన‌ అసౌక‌ర్యం వంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

అలాగే ప‌రిమితికి మించి ఉల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ తీవ్రంగా ప్ర‌భావితం అవుతుంది.

దాంతో గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు వేధిస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతే కాదు, ఉల్లిని ఓవ‌ర్ గా తీసుకుంటే గ‌నుక‌.తల నొప్పి, గుండెళ్లో మంట‌, క‌ళ్లు ఎర్ర‌గా మార‌డం లేదా దుర‌ద‌లు పెట్ట‌డం వంటివి జ‌రుగుతుంటాయి.

అందుకే ఉల్లి పాయ‌ను ఎంత ప‌రిమితంగా తీసుకుంటే అంత మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త యాడ్ లో అదరగొట్టిన మెగాస్టార్ చిరు..