ఆరోగ్యానికి మంచిదని మటన్ ను తరచూ తింటున్నారా.. అయితే ఈ జబ్బులను ఆహ్వానించినట్లే!

నాన్ వెజ్ క్యాటగిరిలో మటన్( Mutton ) ఒకటి.మాంసాహార ప్రియుల్లో చాలా మంది మటన్ ని అమితంగా ఇష్టపడుతుంటారు.

మటన్ తో ఎన్నో రకాల వంటకాలు తయారు చేసుకునే ఆస్వాదిస్తుంటారు.అలాగే ఆరోగ్యానికి మంచిది అని భావించి కొందరు తరచూ మటన్ ను తీసుకుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీరు జబ్బులను ఆహ్వానించినట్లే అవుతుంది.

నిజానికి మటన్ ఒక అద్భుతమైన, ఆరోగ్యకరమైన మాంసం.దీనిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటమే కాకుండా అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్ కూడా మంచి మొత్తంలో ఉంటాయి.

మటన్ ను తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.ముఖ్యంగా మటన్ లో ఐరన్ కంటెంట్ ( Iron Content )పుష్కలంగా ఉంటుంది.

రక్తహీనత ఉన్నవారు మటన్ ను తీసుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడతారు.

అలాగే మటన్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్( Omega 3 Fatty Acids, Zinc ) వంటి పోషకాలు మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి.

జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తాయి.మటన్ ను ఆహారంలో బాగా చేసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.

కండరాలు పుష్టిగా పెరుగుతాయి. """/" / నెలసరి సమయంలో నొప్పులు వేధించకుండా ఉంటాయి.

స్త్రీ పురుషుల్లో లైంగిక సమస్యలు( Sexual Problems ) సైతం దూరమవుతాయి.అందుకే మటన్ ను డైట్ లో చేర్చుకోవాలని నిప్పులు చెబుతుంటారు.

కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.మటన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ తరచూ తీసుకోకూడదు.

మటన్ ను వారానికి రెండు మూడు సార్లు తినే వాళ్ళు ఎందరో ఉన్నారు.

అలాగే రోజూ తినే వాళ్ళు కూడా ఉన్నారు.అతిగా మటన్ ను తింటే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది.

"""/" / మటన్ ను అతిగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ భారీగా పెరుగుతుంది.

కొలెస్ట్రాల్ పెరిగితే గుండె సంబంధిత జబ్బులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే మటన్ లో అధికంగా ఉండే కొవ్వు పదార్థాలు షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతాయి.

ఇక మటన్ ను ఓవర్ గా తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు.

ఊబకాయం బారిన పడే అవకాశాలు రెట్టింపు అవుతాయి.రక్తపోటు కూడా అదుపు తప్పుతుంది.

కాబట్టి మటన్ ఆరోగ్యానికి ఎంత మంచిదైనప్పటికీ అతిగా మాత్రం తీసుకోకండి.

పక్షికి సీపీఆర్ చేసి బతికించిన కేరళ వ్యక్తి.. నెటిజన్లు ఫిదా..