Mutton Side Effects : ఆరోగ్యానికి మంచిదని తరచూ మటన్ తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే!
TeluguStop.com
ఆదివారం వచ్చిందంటే దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ నాన్ వెజ్ ఉండాల్సిందే.మటన్, చికెన్, ఫిష్ ఇలా ఏదో ఒక దాన్ని వండుకొని ఆస్వాదిస్తూ ఉంటారు.
ఆదివారం అనే కాకుండా నిత్యం నాన్ వెజ్ తినే వారు కూడా ఎంతో మంది ఉన్నారు.
ముఖ్యంగా ఆరోగ్యానికి మంచిదని చెప్పి చాలా మంది మటన్ ను తరచుగా తింటూ ఉంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పక తెలుసుకోండి.
మటన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.మటన్ గొప్ప ప్రోటీన్ కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది.
విటమిన్ B12, నియాసిన్, రిబోఫ్లావిన్, ఇనుము, జింక్‌తో సహా అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో మటన్ లోడ్ చేయబడుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్( Omega 3 Fatty Acids ) కూడా మటన్ లో ఉంటాయి.
"""/" /
మటన్ ( Mutton )ను తీసుకోవడం వల్ల రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.
గర్భిణీలకు మటన్‌ని పెట్టడం వల్ల పుట్టే బిడ్డల్లో న్యూరల్ ట్యూబ్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
మటన్ లో ఉండే జింక్ రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది.విటమిన్ బి12 నరాల పనితీరును పెంచుతుంది.
కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తుంది.అయితే ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ మటన్ ను మితంగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
"""/" /
కొందరు మటన్ ను వారానికి రెండు మూడు సార్లు తింటుంటారు.
ఇలా కనుక తింటే మీరు కచ్చితంగా డేంజర్ లో పడతారు.అతిగా మటన్ ను తీసుకోవడం వల్ల ఏరికోరి సమస్యలు తెచ్చుకున్నట్లు అవుతుంది.
మటన్ ని ఎక్కువగా తినడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ.
అతిగా మటన్ ను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది.ఇది క్రమంగా గుండె జబ్బుల బారిన పడతారు.
అలాగే మటన్ ను ఓవర్ గా తీసుకోవడం వల్ల రక్తపోటు ( Blood Pressure )అదుపు తప్పుతుంది.
శరీరంలో క్యాలరీలు భారీగా పెరుగుతాయి.అధిక బరువు, ఊబకాయం బారిన పడతారు.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతంది.
కాబట్టి ఆరోగ్యానికి ఎంత మంచిది అయినప్పటికీ వారానికి ఒకసారికి మించి మటన్ ను తీసుకోకూడదు గుర్తుంచుకోండి!
.