చేసుకోవ‌డం ఈజీగా ఉంద‌ని ఇన్‌స్టంట్ నూడుల్స్ తింటున్నారా.. అయితే ఈ జ‌బ్బులు ఖాయం!

చేసుకోవ‌డం ఈజీగా ఉంద‌ని ఇన్‌స్టంట్ నూడుల్స్ తింటున్నారా అయితే ఈ జ‌బ్బులు ఖాయం!

నూడుల్స్( Noodles ).పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఫాస్ట్ ఫుడ్స్ లో ఒకటి.

చేసుకోవ‌డం ఈజీగా ఉంద‌ని ఇన్‌స్టంట్ నూడుల్స్ తింటున్నారా అయితే ఈ జ‌బ్బులు ఖాయం!

అయితే ఇటీవల కాలంలో ఇన్‌స్టంట్ నూడుల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి.సమయం లేక‌ కొందరు, చేసుకోవడం ఈజీ అని మరికొందరు ఇన్‌స్టంట్ నూడుల్స్ కు బాగా అలవాటు పడుతున్నారు.

చేసుకోవ‌డం ఈజీగా ఉంద‌ని ఇన్‌స్టంట్ నూడుల్స్ తింటున్నారా అయితే ఈ జ‌బ్బులు ఖాయం!

మీరు కూడా ఇన్‌స్టంట్ నూడుల్స్ తింటున్నారా.? అయితే ఏరికోరి జబ్బులను మీరు కొని తెచ్చుకుంటున్నట్లే.

ఇన్‌స్టంట్ నూడుల్స్ లో సోడియం, ప్రిజర్వేటివ్‌లు మరియు ఇతర రసాయనాలు అధికంగా ఉంటాయి.

అందువ‌ల్ల వాటిని త‌ర‌చూ తీసుకుంటే అనేక జ‌బ్బులు త‌లెత్తుతాయి.పైన చెప్పుకున్న‌ట్లుగా ఇన్‌స్టంట్ నూడుల్స్ ( Instant Noodles )లో సోడియం కంటెంట్ అనేది చాలా ఎక్కువ‌గా ఉంటుంది.

అధిక సోడియం ( Sodium )తీసుకోవడం వ‌ల్ల‌ అవయవ నష్టంతో పాటు అధిక రక్తపోటు, గుండె జబ్బులు( High Blood Pressure, Heart Disease ) మరియు స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

అలాగే ఇన్‌స్టంట్ నూడుల్స్ లో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలేమి ఉండ‌వు.

బదులుగా అధిక సంఖ్యలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు మరియు అనారోగ్యకరమైన కొవ్వులు మాత్ర‌మే ఉంటాయి.

ఇవి మీ శ‌రీర బ‌రువును అదుపు త‌ప్పేలా చేస్తాయి. """/" / ఇన్‌స్టెంట్ నూడుల్స్ ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట చుట్టూ కొవ్వు( Belly Fat ) భారీగా పేరుకుపోతుంది.

బాడీ షేప్ అవుట్ అవుతుంది.అలాగే ఇన్‌స్టంట్‌ నూడుల్స్ ను ప్రధానంగా మైదా నుండి త‌యారు చేస్తారు.

మైదా అనేది అధిక ప్రాసెస్ చేయబడిన తెల్లటి పిండి.మైదాలో డైటరీ ఫైబర్ మరియు అవసరమైన పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.

"""/" / మైదా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.

ఇది మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత కలిగిన వ్యక్తులకు ప్ర‌మాద‌క‌రం.అంతేకాకుండా ఇన్‌స్టంట్ నూడుల్స్ ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల‌ డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్‌, ఊబకాయం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది.

ప‌చ్చ‌ళ్లు ఆరోగ్య‌మా? కాదా?.. ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దు?