రాత్రిపూట‌ ఐస్ క్రీమ్ తింటున్నారా.. నో డౌట్ మీ ఆరోగ్యం మ‌టాష్!

ఐస్ క్రీమ్( Ice Cream ).పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఫుడ్స్ లో ఒకటి.

ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిన కూడా ఐస్ క్రీమ్ కచ్చితంగా ఉండాల్సిందే.అలాగే కొందరు తమ ఫ్రిడ్జ్ లో ఎప్పటికప్పుడు ఐస్‌ క్రీమ్ బాక్సులను స్టోర్ చేసి పెట్టుకుంటారు.

ఐస్ క్రీమ్ మనసును రిలాక్స్ చేస్తుంది.మంచి ఉత్సాహాన్ని అందిస్తుంది.

అయితే ఎంత రుచికరంగా ఉన్నప్పటికీ ఐస్ క్రీమ్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

ముఖ్యంగా కొందరు రాత్రిపూట డిన్నర్ అనంతరం ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు.మీకు ఇటువంటి అలవాటు ఉందా.

అయితే నో డౌట్ మీ ఆరోగ్యం మటాష్. """/" / రాత్రిపూట ఐస్ క్రీమ్ తినడం కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు.

అసలు నైట్ టైమ్ ఐస్ క్రీమ్‌ తినడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఐస్ క్రీమ్‌ని క్రమం తప్పకుండా లేదా రాత్రిపూట తిన‌డం చాలా ప్ర‌మాద‌క‌రం.ఒక చిన్న కప్పు ఐస్ క్రీమ్ లో దాదాపు 1000 కేలరీలు ఉంటాయి.

అదనపు కేలరీలు మీ కొవ్వు కణజాలాలను పెంచుతాయి.మరియు ప్రేగులు, అవయవాలలో పేరుకుపోతాయి.

ఫ‌లితంగా భవిష్యత్తులో మీరు ఊబకాయం బారిన ప‌డ‌తారు. """/" / అలాగే రాత్రిపూట ఐస్‌క్రీమ్ తిన‌డం వ‌ల్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.

యాసిడ్ రిఫ్లక్స్‌( Acid Reflux )ను పెంచుతుంది.ఉబ్బరం మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

ఐస్‌క్రీమ్ వంటి అధిక కొవ్వు పదార్ధం విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఇది అజీర్ణానికి దారితీస్తుంది.చక్కెర, పాల కలయిక శరీరం మరియు ప్రేగులలో పులియబెట్టి ఉబ్బరం, గ్యాస్ స‌మ‌స్య‌ల‌కు కారణమవుతుంది.

ఈ లక్షణాలు రాత్రంతా నిద్రకు ఆటంకాన్ని క‌లిగిస్తాయి.రాత్రిపూట ఐస్ క్రీమ్‌ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ భారీగా పెరుగుతాయి.

మ‌ధుమేహం( Diabetes ) ఉన్న‌వారికి ఇది చాలా ప్ర‌మాద‌క‌రం.రాత్రిపూట ఐస్ క్రీమ్‌ తీసుకోవడం మీ గుండెకు సమస్యాత్మకంగా ఉంటుంది.

ఐస్ క్రీమ్‌లో దాదాపు 40 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది.ఇది కొలెస్ట్రాల్ ను పెంచి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

అంతేకాదు రాత్రిపూట లేదా అతిగా ఐస్ క్రీమ్ తిన‌డం వ‌ల్ల మెద‌డు ప‌ని తీరు నెమ్మ‌దిస్తుంది.

వెయిట్ గెయిన్ అవుతారు.దంత స‌మ‌స్య‌లు సైతం తలెత్తుతాయి.

వైరల్ వీడియో: ఓరినాయనో.. అది టీ కాదు విషం.. తాగితే పరలోకానికి ఫ్రీ ఎంట్రీ..