హెల్త్‌కి మేల‌ని ప‌దే ప‌దే పండ్ల‌ను తింటున్నారా? అయితే రిస్క్‌లో ప‌డ్డ‌ట్టే!

పండ్ల‌లో ఎన్నో ర‌కాలు ఉన్నాయి.కొన్ని పండ్లు ఏడాది పొడ‌వునా ల‌భిస్తే.

కొన్ని మాత్రం సీజ‌న‌ల్‌గా దొరుకుతుంటాయి.మిగిలిన ఆహారాల‌తో పోలిస్తే పండ్లు ఎంతో రుచిక‌ర‌మైన‌వి మ‌రియు ఆరోగ్య‌క‌ర‌మైన‌వి.

అందుకే ప్ర‌తి రోజు క‌నీసం రెండు రకాల పండ్ల‌ను అయినా తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు సూచిస్తుంటారు.

ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో, సాయంత్రం స్నాక్స్‌లో, నైట్ డిన్న‌ర్‌లోనూ పండ్ల‌నే తింటుంటారు.

అయితే అంద‌రూ తెలుసుకోవాల్సిన‌ విష‌యం ఏంటంటే.అతి ఏదైనా అనర్థదాయకం.

అందుకు పండ్లు కూడా మిన‌హాయింపు కాదు.హెల్త్‌కి మేల‌ని ప‌దే ప‌దే పండ్ల‌ను తింటే ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం ప‌డుతుంది.

లేనిపోని అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.మ‌రి ఆ స‌మ‌స్య‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా డైటింగ్ చేసే వారు త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌డం కోసం పండ్ల‌నే ఎంచుకుంటారు.

అయితే ప‌రిమితికి మించి పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డం కాదు పెరుగుతారు.

అలాగే పండ్లలో ఉండే చక్కెరలు సహజసిద్ధమైనవే అయినా.ఎక్కువ మొత్తంలో తీసుకుంటే అవి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలను పెంచేస్తాయి.

దాంతో మ‌ధుమేహం బారిన ప‌డే రిస్క్ రెట్టింపు అవుతుంది. """/" / పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.

వాటిని ఓవ‌ర్‌గా తింటే డ‌యేరియా బారిన ప‌డే అవ‌కాశాలు ఉంటాయి.ఇందుకు వాటిలో ఎక్కువగా ఉండే పీచు పదార్థమే కారణమని నిపుణులు చెబుతున్నారు.

పండ్ల‌ను ఎడా పెడా తీసుకోవ‌డం వ‌ల్ల‌ క‌డుపునొప్పి, క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపులో అసౌక‌ర్యం, అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు సైతం ఎదుర‌వుతాయి.

అందుకే రుచిగా ఉన్నాయ‌నో, ఆరోగ్యానికి మంచిద‌నో పండ్ల‌ను అతిగా లాగించేసే అల‌వాటును వ‌దులుకోండి.

లేదంటే ఆరోగ్యానికి ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ రియల్ కాదా.. అదంతా సీజీ మహిమానా??