హెల్త్‌కు మంచిద‌ని మునక్కాయను ఓవ‌ర్‌గా తింటే..రిస్క్‌లో ప‌డ్డ‌ట్టే!

మునక్కాయ.దీని గురించి ప‌రిచ‌యాలే అవ‌స‌రం లేదు.

పిల్ల‌లు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా ఇష్ట‌ప‌డి తినే కూర‌గాయ‌ల్లో మున‌క్కాయ ఒక‌టి.

మున‌క్కాయ క‌మ్మ‌టి రుచి క‌లిగి ఉండ‌ట‌మే కాదు.విటమిన్‌ ఎ, విట‌మిన్ సి, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, బీటాకెరోటిన్, ప్రోటీన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు కూడా దాగి ఉంటాయి.

అందుకే నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను మున‌క్కాయ త‌గ్గించ‌గ‌ల‌ద‌ని పెద్ద‌లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

అయితే మున‌క్కాయ ఆరోగ్యానికి ఎంత మంచి చేసిన‌ప్ప‌టికీ.ఓవ‌ర్‌గా తీసుకుంటే మాత్రం అనేక స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెట్టి రిస్క్‌లో ప‌డేస్తుంది.

సాధార‌ణంగా బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించే శ‌క్తి మున‌క్కాయ‌కు ఉంటాయి.అలా అని మున‌క్కాయ‌ను అతిగా తీసుకుంటే.

శరీరంలోని చక్కెర పరిమాణాన్ని బాగా తగ్గిస్తుంది.దాంతో హైపోక్సేమియాకు గురి కావాల్సి వ‌స్తుంది.

అలాగే పైన చెప్పుకున్న‌ట్టు మున‌క్కాయ‌లో ఫైబ‌ర్ అత్య‌ధికంగా ఉంటుంది.శరీరానికి ఫైబర్ అవసర‌మే.

కానీ, అతిగా తీసుకోవ‌డం చాలా ప్ర‌మాదం.శ‌రీరంలో ఫైబర్ శాతం ఎక్కువైతే.

మ‌ల‌బ‌ద్ధ‌కం, అతిసారం, పేగు సమస్యలు వంటివి ఏర్ప‌డ‌తాయి.ప్రెగ్నెన్సీ మ‌హిళ‌ల‌కు మున‌క్కాయ మంచిద‌ని చెబుతుంటారు.

ఇది నిజ‌మే.గర్భిణీలు మునక్కాయను తీసుకోవ‌డం వల్ల డెలివ‌రీ టైమ్‌లో నొప్పుల బాధ తగ్గుతుంది.

"""/" / మ‌రియు ప్రసవం తర్వాత వచ్చే చాలా సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది.

అయితే మంచిది క‌దా అని గ‌ర్భిణీలు ఎక్కువ‌గా మున‌క్కాయ‌లు తీసుకుంటే శ‌రీర వేడి, ఒళ్లు నొప్పులు వంటి స‌మస్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అంతేకాదు, ఒక్కోసారి గ‌ర్భ‌స్రావానికి కూడా దారి తీస్తుంది.ఇక మున‌క్కాయ‌ల‌ను అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి.

కాబ‌ట్టి, మున‌క్కాయ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

తెలంగాణ ఎక్సైజ్ శాఖపై విజిలెన్స్ దర్యాప్తు..!