కీర‌దోస‌ను ఇలా తీసుకుంటే చాలా డేంజ‌ర‌ట‌.. తెలుసా?

కీర‌దోసకాయ.దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

వేస‌వి వ‌చ్చిందంటే.అంద‌రి ఇళ్ల‌ల్లోనూ కీర ‌దోస‌కాయలను విరి విరిగా వినియోగిస్తుంటారు.

కీర‌దోస‌కాయ‌లో నీరు ఎక్కువ‌గా, కేల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.అలాగే కీర ‌దోస‌ కాయ‌లో కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, ఐర‌న్‌, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ కె, ప్రోటీన్‌, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

అటువంటి కీర ‌దోస వేస‌వి తాపాన్ని తీర్చ‌డంలోనూ, శ‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచ‌డంలోనూ, ర‌క్త పోటును అదుపు చేయ‌డంలోనూ, చర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉండేలా కాపాడటంలోనూ ఇలా ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అయితే కీర దోస ఆరోగ్యానికి మంచిదే.అయిన‌ప్ప‌టికీ అతిగా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా కీర దోస‌కాయ‌ను ఓవ‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక మూత్ర విస‌ర్జ‌న‌కు దారి తీస్తుంది.

కీర దోస‌లో ఎక్క‌వ శాతం నీరే ఉంటుంది.అందువ‌ల్ల‌, కీర దోస‌ను అతిగా తీసుకుంటే.

ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వ‌స్తుంది.ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

ఒక‌వేళ మీకు మ‌ధుమేహం వ్యాధి ఉంటే కీర దోస‌ను అస్స‌లు ఎక్కువ తీసుకోరాదు.

"""/" / అలాగే కొన్ని కీర దోస‌కాయ‌లు చేదుగా ఉంటాయి.అలాంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల‌.

అందులో కుకుర్బిటాసిన్స్ అనే కంటెంట్ శ‌రీరాన్ని విష‌పూరితంగా మార్చేస్తుంది.దాంతో ప్రాణాల‌కే ముప్పుగా మారుతుంది.

కీర దోస‌ను ఓవ‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రానికి దారి తీస్తుంది.అంతేకాదు, మోతాదుకు మించి కీర దోస తీసుకుంటే ర‌క్త పోటు స్థాయి ప‌డిపోతుంది.

లో బీపీతో బాధప‌డే వారికి ఇది చాలా డేంజ‌ర్‌.కాబ‌ట్టి, ఆరోగ్యానికి మంచిది క‌దా అని చెప్పి.

కీర దోస‌ను ఓవ‌ర్‌గా మాత్రం తీసుకోకండి.‌‌.

ఆ రీజన్ వల్లే నాకు సౌత్ లో ఆఫర్లు తగ్గాయి.. ఇలియానా షాకింగ్ కామెంట్స్ వైరల్!