నిత్యం నిమ్మ‌ర‌సం తీసుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

గోరువెచ్చని నీటితో నిమ్మరసం ( Lemon Juice )క‌లుపుకుని తాగే అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది.

రోజూ ఉద‌యం లేవ‌గానే.టీ, కాఫీల ( Tea , Coffee )క‌న్నా ముందు నిమ్మ‌ర‌స‌మే తీసుకుంటూ ఉంటారు.

ఎందుకూ మ‌న ఆరోగ్యానికి మంచ‌ద‌ని.నిమ్మ‌ర‌సంలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

రోగాల బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తుంది.నిమ్మ‌ర‌సం  శరీరంలో మెటబాలిజాన్ని పెంచి బ‌రువు త‌గ్గే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తుంది.

నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి స‌హ‌జ మెరుపును జోడిస్తాయి.నిమ్మరసం లివర్ పనితీరును ( Liver Function )మెరుగుపరుస్తుంది, శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

మ‌రియు బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.ఇలా చెప్పుకుంటూ పోతూ లెమ‌న్ జ్యూస్ వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

అయితే ఆరోగ్యానికి మంచ‌ద‌ని కొంద‌రు నిమ్మ ర‌సాన్ని అధికం మొత్తంలో తీసుకుంటారు.దీని వ‌ల్ల లాభాలు పొంద‌క‌పోగా.

నష్టాలు చేకూర‌తాయి. """/" / నిమ్మ ర‌సాన్ని అతిగా తీసుకుంటే శరీరంలో ఆక్సలేట్స్ పెరుగుతాయి.

ఇది కొంత మందిలో కిడ్నీ రాళ్ల సమస్యకు( Kidney Stone Problem ) దారితీస్తుంది.

అలాగే అధికంగా నిమ్మరసం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి క్షీణించి, విరేచనాలు లేదా మలబద్ధకం ( Constipation )వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌చ్చు.

లెమ‌న్ జ్యూస్ సిట్రిక్ యాసిడ్ ను ఎక్కువ‌గా కలిగి ఉంటుంది.అందువ‌ల్ల నిమ్మ ర‌సాన్ని అధికంగా తీసుకుంటే ఆమ్లతా, గ్యాస్, గుండెల్లో ( Acidity, Gas, Heartburn )మంట వంటి సమస్యలు ఇబ్బంది పెడ‌తాయి.

దంతాల‌పై ఎమాల్ క్షీణిస్తుంది. """/" / నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవచ్చు.

మ‌ధుమేహం ఉన్నవారికి ఇది ప్రమాదకరం.అంతేకాకుండా అధికంగా నిమ్మరసం తీసుకుంటే కొందరికి చర్మంపై మచ్చలు, అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి.

కాబ‌ట్టి, నిత్యం నిమ్మ‌ర‌సం తాగేవారు జాగ్ర‌త్త వ‌హించాలి.రోజుకు  2 నుంచి 4 టీస్పూన్లు నిమ్మ‌ర‌సం తీసుకోవడం చాలామందికి అనుకూలంగా ఉంటుంది.

అంత‌కు మించితే ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం ప‌డుతుంది గుర్చుంచుకోండి.

వైరల్ పోస్ట్: దహీపూరి తినాలన్న మహిళా ఆన్లైన్ ఆర్డర్ చేయగా..?