ఆరోగ్యానికి వ‌రం కొబ్బ‌రి నీళ్లు.. అతిగా తీసుకుంటే మాత్రం ఆ స‌మ‌స్య‌లు ఖాయం!

ప్రస్తుత వేసవి కాలంలో ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పానీయాల్లో కొబ్బరి నీళ్లు( Coconut Water ) ముందు వరుసలో ఉంటాయి.

కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి.అందువల్ల కొబ్బరినీళ్లు మనకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

వేసవికాలంలో చాలామంది నిత్యం కొబ్బరి నీళ్లు తీసుకుంటారు.బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడానికి కొబ్బరి నీళ్లు ఉత్తమంగా సహాయ పడతాయి.

అలాగే వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తాయి.అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ కూడా కొబ్బరి నీళ్లు అతిగా తీసుకుంటే మాత్రం డేంజర్ లో పడ్డట్టే.

"""/" / కొబ్బరి నీళ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది.కొబ్బ‌రి నీళ్ల‌ను అధికంగా తాగడం వల్ల పొటాషియం స్థాయిలు పెరుగుతాయి.

దాంతో శరీరంలో ఎలక్ట్రోలైట్‌ల అసమతుల్యత ఏర్పడవచ్చు.ఇది మూత్రపిండాల సమస్య మరియు క్రమరహిత హృదయ స్పందనకు కారణం అవుతుంది.

ఒక‌వేళ మీరు ఇప్ప‌టికే కిడ్నీ సమస్యల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లైతే కొబ్బరినీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

"""/" / అలాగే అధిక రక్తపోటు( High Blood Pressure ) ఉన్న వారు కూడా కొబ్బ‌రి నీళ్ల‌ను దూరం పెట్ట‌డ‌మే మంచిద‌ని అంటున్నారు.

ఎందుకంటే కొబ్బ‌రి నీళ్లు అధిక సోడియం కంటెంట్ ను క‌లిగి ఉంటుంది.ఇది ర‌క్త‌పోటు స్థాయిల‌ను మరింత పెంచుతుంది.

కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం.ఇతర జ్యూస్‌ల కంటే కొబ్బరి నీళ్లలో చక్కెర తక్కువగా ఉందని నమ్ముతారు.

కానీ ఒక కప్పు కొబ్బరి నీళ్లలో 6.26 గ్రాముల చక్కెర ఉంటుంది.

కాబ‌ట్టి మ‌ధుమేహం ఉన్న‌వారు కొబ్బ‌రి నీళ్ల‌ను మితంగా మాత్ర‌మే తీసుకోవాలి.లేదంటే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపు త‌ప్పుతాయి.

ఇక కొబ్బ‌రి నీళ్ల‌ను అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల‌ కొంతమందిలో కడుపు నొప్పి( Stomach Pain ) మరియు ఉబ్బరం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

కొబ్బరి నీళ్లలో మూత్రవిసర్జన లక్షణాలను కూడా క‌లిగి ఉన్నాయి.అందువల్ల, దీన్ని ఎక్కువగా తాగడం వల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది, దాంతో మీరు తరచు వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వ‌స్తుంది.

మొదటిసారి ఆ రూమర్ పై స్పందించిన అనుష్క.. ఇక చాలు ఆపండంటూ?