మజ్జిగ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఇలా తాగితే చాలా డేంజర్!

మన శరీరానికి అత్యంత మేలు చేసే పానీయాల్లో మజ్జిగ( Buttermilk ) కూడా ఒకటి.

చాలా మందికి నిత్యం మజ్జిగ తాగే అలవాటు ఉంటుంది.వివిధ రోగాలకు మజ్జిగ నివారిణిగా పని చేస్తుంది.

ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.అయితే హెల్త్ పరంగా మజ్జిగ మంచిదే అయినప్పటికీ అతిగా తీసుకుంటే మాత్రం డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

లిమిట్ లేకుండా మజ్జిగ తాగడం వల్ల పలు దుష్ప్రభావాలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.సాధార‌ణంగా ఎక్కువ శాతం మంది ఇంట్లో తయారు చేసిన మజ్జిగ‌ కన్నా మార్కెట్ లో లభ్యమయ్యే బ్రాండెడ్ మజ్జిగ తాగడానికే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు.

కారణం టెస్ట్.అయితే బయట దొరికే మజ్జిగలో రుచి పెరగడానికి రకరకాల పదార్థాలు కలుపుతారు.

అవి జీర్ణకోశ స‌మ‌స్య‌లను తెచ్చిపెడ‌తాయి.పైగా బ‌య‌ట దొరికే మజ్జిగలో కేలరీలు కూడా అధికంగా ఉంటాయి.

అటువంటి మజ్జిగ అతిగా తాగితే బరువు పెరగడానికి( Weight Gain ) దారితీస్తుంది.

"""/" / మజ్జిగ‌ ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ.అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల శ్లేష్మం ఉత్పత్తి పెరుగుతుంది.

ఇది నిద్రిస్తున్నప్పుడు నాసికా రద్దీ లేదా అసౌకర్యానికి గురి చేస్తుంది.ఓవ‌ర్ గా మ‌జ్జిగ‌ను తీసుకుంటే అందులో ఉండే సోడియం కంటెంట్ అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలతో( Heart Problems ) బాధపడేవారికి ఆందోళన కలిగిస్తుంది.

"""/" / అలాగే మ‌జ్జిగ‌ను ప‌దే ప‌దే తాగ‌డం వ‌ల్ల అందులోని సంతృప్త కొవ్వు కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను పెంచుతుంది.

కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ముప్పు పెరుగుతుంది.మ‌జ్జిక‌లో లాక్టోస్ అనే ప‌దార్థం ఉంటుంది.

ఇది గ్యాస్, డయేరియా మరియు లాక్టోస్ అసహనం ఉన్న వారిలో కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

పైగా లాక్టోస్ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది.జ‌లుబు, జ్వ‌రం, పుప్పొడి అలెర్జీ ఉన్నట్లయితే రాత్రిపూట మ‌జ్జిగ‌ను తీసుకోరాదు.

ఎందుకంటే, మ‌జ్జిగ ఆయా స‌మ‌స్య‌ల‌ను మ‌రింత తీవ్ర‌త‌రం చేస్తుంది.

అన్ స్టాపబుల్ షోకు హాజరు కాని ఈ హీరోలు రానా షోకు అయినా హాజరవుతారా?