భోజనం చేసిన వెంటనే టీ తాగితే జరిగే అనర్థాలు ఏంటో తెలుసా?
TeluguStop.com
టీ.సూపర్ రిలాక్సేషన్ డ్రింక్ అనడంలో సందేహమే లేదు.
అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తమ డైట్‌లో ఒక కప్పు టీని తీసుకుంటుంటారు.
అలాగే తెలిసో, తెలియక కొందరు భోజనం చేసిన వెంటనే కూడా ఓ కప్పు టీ తాగుతుంటారు.
కానీ, భోజనం తిన్న వెంటనే టీని అస్సలు తాగరాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అలా తాగడం వల్ల అనేక అనర్థాలను ఫేస్ చేయాల్సి ఉంటుందట.మరి లేటెందుకు భోజనం చేసిన వెంటనే టీ తాగితే వచ్చే నష్టాలు ఏంటో చూసేయండి.
కడుపు నిండా భోజనం చేసి.ఆ వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ పోషకాలు తీవ్రంగా దెబ్బ తింటాయి.
దాంతో రక్త హీనత ఏర్పడి.నీరసం, అలసట మరియు తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
తల నొప్పి నుంచి రిలీఫ్‌ను అందించడంలో టీ అద్భుతంగా సహాయపడుతుంది.
కానీ, భోజనం చేసిన వెంటనే టీ తాగితే మాత్రం తల నొప్పి, మైకం, చికాకు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
"""/" /
అలాగే భోజనం చేసిన కొద్ది సేపటికే టీ సేవించడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు నెమ్మదిస్తుంది.
దాంతో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల వచ్చే మరో అనర్థం ఏంటంటే.
హైబీపీ.అవును, ఒక్కోసారి తిన్న వెంటనే టీ తాగేస్తే.
రక్త పోటు స్థాయిలు అదుపు తప్పి అమాంతం పెరిగిపోతాయి.మరియు గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా పెరిగిపోతూ ఉంటుంది.
అందువల్లనే, భోజనం చేసిన వెంటనే టీ తాగొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.భోజనానికి, టీకి మధ్య కనీసం గంట లేదంటే రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
జైలు బయట అదిరిపోయే స్టెప్పులు వేసిన యువకుడు..(వీడియో)