ఆరోగ్యానికి మేలని వేడి నీళ్లు తాగుతున్నారా..అయితే జాగ్రత్త!
TeluguStop.com
ఆరోగ్యానికి మేలని చాలా మంది ఉదయం లేవగానే ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగుతూ ఉంటారు.
ఇది నిజంగా మంచి పనే.వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుంది.
అజీర్తి తదితర జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.బరువు నియంత్రణలో ఉంటుంది.
గొంతు సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉండటం వల్లే ఆరోగ్య నిపుణులు కూడా వేడి నీళ్లు తాగమని చెబుతుంటారు.
అయితే మంచిదన్నారు కదా అని కొందరు రోజంతా వేడి నీరే తాగుతారు.అలాగే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కూడా తరచూ వేడి నీటినే తీసుకుంటున్నారు.
కానీ, ఇలా అతిగా వేడి నీరు తీసుకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా వేడి నీటిని తరచూ తీసుకోవడం వల్ల తలనొప్పి, చికాకు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అలాగే ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది.ఈ సీజన్‌లో వేడి నీటిని తీసుకుంటే దాహం తీరదు.
దాంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.తరచూ వేడి వేడిగా ఉండే నీరు తాగడం వల్ల గొంతులో కణాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది.
అందుకే రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మించి వేడి నీళ్లను తీసుకోరాదని అంటున్నారు.
అలాగే పదే పదే వేడి నీళ్లు తాగే అలవాటు క్రమంగా కొనసాగితే నరాలు కూడా చిట్లి పోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
</br. """/" /
అంతేకాదు, అతిగా వేడి నీళ్లను తీసుకుంటే మూత్ర పిండాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
కిడ్నీ చేసే సాధారణ ఫంక్షన్ ని ప్రభావితం చేస్తుంది.ఇక వేడి నీళ్లనే తరచూ తీసుకుంటే రక్త పోటు పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి, ఆరోగ్యానికి మంచిదనో, కరోనా వైరస్ రాకుండా ఉంటుందనో ఓవర్‌గా మాత్రం వేడి నీరు తీసుకోకండి.
పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని మహేష్ బాబు తో రాజమౌళి భారీ రిస్క్ చేస్తున్నాడా..?