చలికాలంలో రోజుకు 2 సార్లు స్నానం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
TeluguStop.com
ప్రతి ఒక్కరికి శారీరక శుభ్రత ( Physical Cleanliness )అనేది చాలా అవసరం.
అందుకు నిత్యం స్నానం చేయాలి.స్నానం చేయడం వల్ల చర్మం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా తొలగిపోతాయి.
బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది.నొప్పులు దూరమై బాడీ రిలాక్స్ అవుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది.నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
ఇలా స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.అయితే రోజుకు రెండు సార్లు స్నానం( Bathe Twice ) చేసేవారు ఉన్నారు.
అలాగే ఒకసారి చేసే వారు కూడా ఉన్నారు.ప్రస్తుత చలికాలంలో రోజుకు రెండు సార్లు స్నానం చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
వింటర్ లో ఆల్మోస్ట్ అందరూ వేడి వేడి నీటితో స్నానం చేయడానికే ఇష్టపడతారు.
అయితే వేడి నీరు మీ చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తుంది.ఫలితంగా చర్మం పొడిబారిపోవడం, దురద మరియు చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి.
"""/" /
రసాయన ఉత్పత్తుల నుండి రక్షించడానికి మన చర్మం మంచి బ్యాక్టీరియాను ( Bacteria )ఉత్పత్తి చేస్తుంది, కానీ చలికాలంలో రోజువారీ స్నానం ఈ బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.వింటర్ లో రోజుకు రెండు సార్లు స్నానం చేస్తే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందట.
అవును, అధిక పరిశుభ్రత పద్ధతులు చర్మం యొక్క సహజ నూనెలకు అంతరాయం కలిగిస్తాయి, ఇది రక్షణ అవరోధానికి కారణమై శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలను రెట్టింపు చేస్తుంది.
"""/" /
కాబట్టి, చలికాలంలో రోజుకు ఒకసారి స్నానం చేయడం అలవాటు చేసుకుంటే మంచిదని అంటున్నారు.
ఒకవేళ శరీరానికి పెద్దగా శ్రమ లేకపోతే వింటర్ సీజన్ లో ఒకరోజు స్నానాన్ని స్కిప్ కూడా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అలాగే స్నానానికి వేడి వేడి నీటిని కాకుండా గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి.
మీ చర్మం యొక్క సహజ తేమను తొలగించే సువాసన లేదా రాపిడి సబ్బులను ఉపయోగించడం మానుకోవాలి.
ఇక చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి స్నానం ముగించిన వెంటనే మాయిశ్చరైజర్‌ను వాడాలి.
నాడు పొట్ట చేత పట్టుకుని అమెరికాకి.. నేడు కంపెనీకి అధినేత, ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ