క్రమం తప్పకుండా అలోవెరా ను ఇలా ఉపయోగిస్తున్నారా.. అయితే ప్రమాదమే..?

ప్రస్తుత సమాజంలో మచ్చలు మొటిమలు లేని చర్మాన్ని పొందడానికి అందరూ అలోవెరా జెల్( Aloevera Gel ) ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు.

అలోవెరా జెల్ లో ఉండే పాలీపెనాల్స్ ముఖంపై గాయాలను తొలగించడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

అంతేకాకుండా ఇందులో అధిక పరిమాణంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి.

కాబట్టి దీన్ని చర్మానికి వినియోగించడం వల్ల తీవ్ర చర్మ సమస్యల( Skin Problems ) నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.

అంతే కాకుండా ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయి.

అయితే దీనిని వినియోగించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని కొంతమంది మోతాదుకు మించి కూడా ఉపయోగిస్తున్నారు.

"""/" / ఇలా చేయడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇందులో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు అతిగా వినియోగించడం వల్ల శరీరానికి తీవ్ర దుష్ప్రభావాలను కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అతిగా ఉపయోగించడం వల్ల కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కలబంద ఆకులలో( Aloevera Leaves ) ఉండే జిగురు లాంటి మిశ్రమం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.

అంతేకాకుండా అలర్జీ, కడుపులో మంట, తిమ్మిర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

"""/" / ఇందులో పొటాషియం పరిమాణాలు( Potassium ) కూడా అతి తక్కువగా ఉంటాయి.

అంతే కాకుండా కొందరిలో డయోరియా( Diarrhea ) వంటి సమస్య లు కూడా వచ్చే అవకాశం ఉంది.

మధుమేహంతో( Diabetes ) బాధపడేవారు ప్రతి రోజు అలోవెరాను ఉపయోగించడం వల్ల రక్తంలోని చక్కెర ప్రమాణాలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది.

దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా క్రమం తప్పకుండా కలబంద రసం తాగడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గతంలో నేను కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమే.. సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్!