ఆరోగ్యానికి మేల‌ని క‌ల‌బంద ర‌సం తాగుతున్నారా? అయితే జ‌ర జాగ్ర‌త్త‌!

క‌ల‌బంద.దీని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

దాదాపు అంద‌రి ఇంటి పెరటిలోనూ క‌ల‌బంద మొక్క కామ‌న్‌గా ఉంటుంది.సౌంద‌ర్య సాద‌న‌లో విరి విరిగా ఉప‌యోగించే క‌ల‌బంద.

ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది.

ముఖ్యంగా బ‌రువును అదుపులోకి తెస్తుంది.అందుకే చాలా మంది క‌ల‌బంద నుంచి ర‌సం త‌యారు చేసుకుని సేవిస్తుంటారు.

అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్ప‌టికీ.క‌ల‌బందతో జ‌ర జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఎందుకంటే, క‌ల‌బంద వ‌ల్ల ప్ర‌యోజ‌నాలే కాదు.దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.

మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా కొంద‌రు ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌నే ఉద్ధేశంలో ప్ర‌తి రోజు క‌ల‌బంద ర‌సాన్ని సేవిస్తుంటారు.

కానీ, ఇలా రెగ్యుర‌ల్‌గా క‌ల‌బంద తీసుకుంటే శ‌రీరంలో పొటాషియం కంటెంట్ పెరిగిపోతుంది.దాంతో గుండె సంబంధిత వ్యాధులు త‌లెత్తుతాయి.

మ‌రియు శ‌రీరంలో బ‌ల‌హీనంగా మారిపోయి.నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు పెరిగిపోతాయి.

"""/" / అలాగే బ‌రువు త‌గ్గాలని ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో క‌ల‌బంద ర‌సాన్ని తాగుతుంటారు.

కానీ, ఇలా ఖాళీ క‌డుపుతో క‌ల‌బంద తీసుకుంటే.త‌ల తిర‌గ‌డం, వికారం, పొట్ట‌లో అసౌక‌ర్యంగా ఉండ‌టం, అతిసారం, డీహైడ్రేష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

"""/" / ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క‌ల‌బంద ర‌సాన్ని తీసుకోరాదు.క‌ల‌బంద‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భ‌స్రావం జ‌రిగే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.

మ‌రియు చిన్న పిల్ల‌ల‌కు కూడా క‌ల‌బంద ర‌సాన్ని ఇవ్వ‌రాదు.ర‌క్త పోటు స్థాయిల‌ను త‌గ్గించే సామ‌ర్థ్యం క‌ల‌బంద‌కు ఉంది.

అందు వ‌ల్ల, హైబీపీతో బాధ ప‌డే వారు క‌ల‌బంద తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.

కానీ, లో బీపీతో ఇబ్బంది ప‌డే వారు క‌ల‌బంద తీసుకుంటే.ర‌క్త పోటు స్థాయిలు మ‌రింత త‌గ్గిపోతాయి.

ఇక హెల్త్‌కు మేల‌ని చెప్పి క‌ల‌బంద ర‌సాన్ని అతిగా తీసుకుంటే.జీర్ణక్రియకు సంబంధిత స‌మ‌స్య‌లు కూడా చుట్టు ముడ‌తాయి.

నాటుకోడి గుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయా.. వాటికి ఎందుకంత క్రేజ్!