రోజంతా ఏసీలోనే ఉంటున్నారా..అయితే ఈ జబ్బులు తప్పవు!
TeluguStop.com
ఇటీవల కాలంలో అందరి ఇళ్లల్లోనూ టీవీ, ఫ్రిడ్జ్‌లతో పాటుగా ఏసీలు కామన్‌గా కనిపిస్తున్నారు.
ఇక ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ కార్యాలయాలు, షాపింగ్స్ మాల్స్ ఇలా ఎక్కడ చూసినా ఏసీలే దర్శనమిస్తున్నాయి.
ప్రజలు ఏసీలకు ఎంతగానో అలవాటు పడ్డారు.ముఖ్యంగా వేసవి కాలం వచ్చిదంటే.
రోజంతా ఏసీలో ఉండే వారు ఎందరో.అయితే రోజంతా ఏసీలో ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఏసీలో అధిక సమయం పాటు ఉండటం వల్ల.రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతాయి.
దాంతో త్వరగా అలసిపోవడం, లో బీపీ, నీరసం వంటి సమస్యలును ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే ఏసీలో రోజులో ఆరు గంటలకు మంచి ఉండటం వల్ల మైగ్రేన్ తలనొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
"""/" /
రోజంతా ఏసీలోనే ఉండడటం వల్ల.ఆ చల్లదనానికి చర్మం పొడిబారిపోతుంది.
ఒక వేళ డ్రై స్కిన్ వాళ్లు ఏసీలో ఉంటే.సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.
అలాగే ఏసీలో ఉండే వారు సరిగ్గా నీరు తాగకుండా ఉండే.మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
ఒక మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడితే.ఎన్ని ఇబ్బందులు పడాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎక్కువ సమయం పాటు ఏసీలోనే గడిపితే.గొంతు గరగర, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టడమే కాదు ఆస్తమా వచ్చే రిస్క్ కూడా ఉంది.
ఇక ఒక్క సారి ఆస్తమా వచ్చిందంటే.జీవిత కాలం ఇబ్బంది పెడుతునూ ఉంటుంది.
ఇక రోజంతా ఏసీలోనే ఉండటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వడం, చర్మ అలర్జీలు, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి, చల్లగా ఉంటుంది కదా అని ఏసీలోనే ఎక్కువ సమయాన్ని గడిపేయకండి.కాస్తంత బటయ వాతావరణంతో గడిపెందుకు ప్రయత్నించండి.
యోగి ఆదిత్యనాథ్‌ను ఆకట్టుకున్న ఇటాలియన్ మహిళలు.. ఏం చేశారో చూడండి!