Siddu Jonnalagadda : అదిరిపోతున్న సిద్దు జొన్నలగడ్డ అప్ కమింగ్ సినిమాలు లైనప్ …మామూలు ముదురు కాదు కదా !

మన టిల్లు గాడు మామూలోడు కాదు.డిజే టిల్లు( DJ Tillu ) సినిమా విజయవంతమయ్యాక అతని రేంజ్ మరో రేంజ్ కి వెళ్ళిపోయింది అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి.

ప్రస్తుతం ఉన్నాడు సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) అయితే టిల్లు ఇండస్ట్రీలోని ఒక బ్లాక్ బాస్టర్ సినిమా కాగా టిల్లు స్క్వేర్ కూడా అంతకన్నా పెద్ద హిట్ కావాలని సిద్దు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ కాస్త టైం పట్టినా సరే మంచి సినిమాతోనే బయటకు రావాలని ఎదురు చూస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో షూటింగ్ టైంలోనే మరో పక్క అనేక సినిమాలను లైన్లో కూడా పెట్టేశాడు.

తన దగ్గరికి వచ్చిన స్టోరీలలో మంచి స్టోరీలను ఎంచుకొని షూటింగ్ అతి త్వరలో ప్రారంభించబోతున్నాడు.

ఇప్పటి వరకు మరి సిద్దు ఎన్ని స్టోరీలు ఓకే చేశాడు ? ఆ సినిమాల వివరాలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీ నీరజా కోన( Neerajaa Kona ) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు.

కొన్ని రోజుల ముందే ఈ సినిమాకు సంబంధించిన ప్రారంబోత్సవ పూజ కూడా ఘనంగా జరిగింది.

తెలుసు కదా అనే పేరుతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.

అలాగే వైష్ణవి(Vaishnavi ) అని మరొక లేడీ డైరెక్టర్ సినిమాలో కూడా నటించడానికి టిల్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అనౌన్స్మెంట్ జరిగింది ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా సుకుమార్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

"""/" / వరుసగా ఇద్దరు లేడీ దర్శనం దర్శకులకు అవకాశం ఇచ్చిన సిద్దు ఆ తర్వాత ఒక సీనియర్ డైరెక్టర్ తో పని చేయాలని అనుకుంటున్నాడట అందుకే బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమా షూటింగ్ కూడా అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది.అలాగే ఇండస్ట్రీలో ఒక స్టార్ ప్రొడ్యూసర్ కి సైతం డీజే టిల్లు తన డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆ వివరాలు అతి త్వరలో తెలియరానున్నాయి.

ఇలా మూడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన సిద్దు 2024 లో వరుస సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఇప్పటికే టిల్లు తర్వాత చిత్రాలు విడుదల చేయడానికి షూటింగ్ లో బిజీగా ఉన్నాయి.

వైరల్ వీడియో: పోలీసు స్టేషన్‌లోనే మహిళతో రాసలీలలు చేసిన పోలీస్ అధికారి