చిరు సినిమా నుంచి తప్పుకున్న సిద్దు జొన్నలగడ్డ… ఆ హీరోకి దక్కిన ఛాన్స్?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి చిరంజీవి త్వరలోనే భోళాశంకర్( Bhola Shankar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

మెహర్ రమేష్ ( Mehar Ramesh ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 11 వ విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అమెరికా వెకేషన్ లో ఉన్నారు.

తిరిగి రాగానే ఈయన కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ కానున్నారు. """/" / ఇకపోతే ఈ సినిమా తర్వాత చిరంజీవి తదుపరి సినిమాని బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna ) దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకు మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత ( Sushmitha ) నిర్మాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం.

అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను అధికారికంగా ప్రకటించబోతున్నారు ఇకపోతే ఈ సినిమా మలయాళ చిత్రం బ్రో డాడీకి రీమేక్ సినిమాగా రాబోతుందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో చిరంజీవికి కొడుకు పాత్రలో నటించడం కోసం మరొక యంగ్ హీరోని తీసుకోబోతున్నారని ఇండస్ట్రీ టాక్.

"""/" / ఇక ఈ సినిమాలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ( Siddhu Jonnalagadda ) నటించబోతున్నారంటూ ఇదివరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ప్రస్తుతం ఈయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారని సిద్దు జొన్నలగడ్డ స్థానంలో మరొక యంగ్ హీరోని సెలెక్ట్ చేశారని తెలుస్తోంది.

సిద్దు జొన్నలగడ్డ డేట్స్ కుదరని కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో మరొక ఇద్దరు హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి.

ఒకరు శర్వానంద్ ( Sharwanand ) కాగా మరొకరు కార్తికేయ ( Karthikeya ) .

వీరిద్దరిలో ఒకరికి ఈ సినిమాలో అవకాశం ఉండబోతుందని తెలుస్తుంది.అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన ఫ్యాన్ బాయ్ అయినటువంటి కార్తికేయకు ఓటు వేసినట్టు తెలుస్తుంది.

అయితే త్వరలోనే ఈ విషయాలన్నింటినీ కూడా అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.

వైరల్: అదిరిపోయిన షారుఖ్, ఐశ్వర్య రాయ్ పిల్లల స్టేజ్ షో!