‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ పై క్లారిటీ.. నెక్స్ట్ ఇయర్ కు వెళ్ళిపోయిన సిద్ధూ!

గత ఏడాదిలో మన టాలీవుడ్ ( Tollywood )బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాల్లో ''డీజే టిల్లు'' ( DJ Tillu )కూడా ఉంది.

ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ ( Siddhu Jonnalagadda ) హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు.

"""/" / ఈ సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేసిందో అందరికి తెలుసు.

ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టరనే చెప్పాలి.డైరెక్టర్ విమల్ కృష్ణ( Director Vimal Krishna ) ఈ సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమా బాగా అలరించడంతో దీనికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.అయితే ఈసారి ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకు 'టిల్లు సీక్వెల్' ( Tillu Sequel ) అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు.

ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) ను ఎంపిక చేసారు.

ఈ జోడీ ఎలా ఉంటుందో చూడాలని ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

"""/" / మరి తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ వీడింది.

ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు.కానీ రిలీజ్ వాయిదా పడింది.

ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.ఈ సినిమాను ఏకంగా 2024 ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు.

మొత్తానికి టిల్లు మాస్ రైడ్ నెక్స్ట్ ఇయర్ కు ఫిక్స్ అయ్యింది.కాగా ఈ సినిమాకు రామ్ మిర్యాల సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

అక్కడ సోనూసూద్ కు 390 అడుగుల కటౌట్.. విద్యార్థులు అభిమానాన్ని చాటుకున్నారుగా!