‘టిల్లు స్క్వేర్’ నుండి అదిరిపోయే అప్డేట్.. రాధిక ఎంట్రీ మళ్ళీ ఉంటుందా?

గత ఏడాదిలో మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాల్లో ''డీజే టిల్లు''( DJ Tillu ) కూడా ఉంది.

ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమాను ప్రేక్షకులు ఇప్పటికి ఫస్ట్ చూసినంతగానే ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో యూత్ ను మెయిన్ గా ఆకర్షించిన అంశం సిద్ధూ, నేహా రొమాన్స్.

వీరి కెమిస్ట్రీకి యూత్ అంతా ఫిదా అయ్యారు.నేహా శెట్టి( Neha Shetty ) రాధిక పాత్రలో ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుందో చెప్పాల్సిన పని లేదు.

ఈమె ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అనుకుంటే అనూహ్యంగా అంతగా అవకాశాలు తెచ్చుకోలేక పోయింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. """/" / మల్లిక్ రామ్( Mallik Ram ) డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకు 'టిల్లు స్క్వేర్'( Tillu Square ) అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు.

ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ ను( Anupama Parameswaran ) ఎంపిక చేసారు.

ఈ జోడీ ఎలా ఉంటుందో చూడాలని ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. """/" / ఈ సినిమా సీక్వెల్ లో కూడా రాధిక( Radhika Role ) మరోసారి ఎంట్రీ ఇస్తుంది అని టాక్.

క్లైమాక్స్ లో నేహా శెట్టి రాధిక పాత్ర ఎంట్రీ ఉంటుంది అని డైరెక్టర్ కొత్తగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

మరి ఈ వార్త ఇప్పుడు బయటకు రావడంతో మరింత కిక్ ఇస్తుంది.సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో ఈ యంగ్ హీరో ఎలాంటి హిట్ అందుకుంటాడో.

అనుపమ ఏ రేంజ్ లో అందాల జాతర చేసిందో.నేహా శెట్టి ఎంట్రీ ఎలా ఉంటుందో అనేది చూడాలి.

పచ్చిమిర్చి కట్ చేశాక చేతులు మండిపోతున్నాయా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!