ఎన్నో కష్టాలు అవమానాలు.. నేడు స్టార్ స్టేటస్.. సిద్ధు జొన్నలగడ్డ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సిద్ధు జొన్నలగడ్డ( Sidhu Jonnalagadda ) పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.

టిల్లూ స్క్వేర్ మూవీ( Tillu Square Movie ) కలెక్షన్ల పరంగా క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీఇన్నీ కావు.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హనుమాన్ సినిమా కలెక్షన్ల పరంగా ఏ స్థాయిలో మ్యాజిక్ చేసిందో ప్రస్తుతం టిల్లూ స్క్వేర్ మూవీ కూడా అదే స్థాయిలో కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.

టిల్లూ స్క్వేర్ సినిమాకు కథ, కథనం, డైలాగ్స్ రాసింది కూడా సిద్ధు కావడం గమనార్హం.

మల్టీ టాలెంటెడ్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ గుంటూరు టాకీస్( Guntur Talkies ) సినిమాతో హీరోగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

డీజే టిల్లు సినిమా సక్సెస్ సాధించడం సిద్ధు జొన్నలగడ్డ ఇమేజ్ ను మార్చేసింది.

టిల్లూ స్క్వేర్ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ మరో పదేళ్ల పాటు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

"""/" / అయితే హీరోగా సక్సెస్ కాకముందు సిద్ధు జొన్నలగడ్డకు ఎదురైన అవమానాలు అన్నీఇన్నీ కావు.

నేను కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఐదారేళ్ల క్రితం నా ఫేస్ పై ఉన్న మచ్చల గురించి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కామెంట్ చేయడం బాధ పెట్టిందని సిద్ధు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు.

ఆ మాటలకు చాలా ఏడ్చానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. """/" / అయితే ఎన్నో అవమానాలు ఎదురైనా ఆ అవమానాలను దిగమింగుకొని సిద్ధు జొన్నలగడ్డ సక్సెస్ సాధించారు.

టిల్లూ స్క్వేర్ కు సీక్వెల్ గా టిల్లూ క్యూబ్ తెరకెక్కనుండగా ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

“పోలీస్ అంకుల్.. మా నాన్నను పట్టుకోండి!”.. చిన్నోడు కంప్లైంట్‌కు పోలీసులు షాక్!