పుష్ప2 1400 కోట్లు.. మిస్ యూ 2 కోట్లు.. సిద్దార్థ్ ఇప్పటికైనా తీరు మార్చుకుంటారా?
TeluguStop.com
టాలీవుడ్ హీరో సిద్దార్థ్ ( Hero Siddharth ) గురించి మనందరికీ తెలిసిందే.
సిద్ధార్థ ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇటీవల కాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికీ అవి ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాయి.
దీంతో సిద్ధార్థ ఖాతాలో సరైన సక్సెస్ సినిమా పడి చాలా ఏళ్ళు అవుతోంది.
తెలుగులో సినిమాలు తగ్గించినా క్రేజ్ అలానే కాపాడుకున్నారు.రీసెంట్ గా మిస్ యు మూవీతో ( Miss You Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చారు సిద్ధార్థ్.
లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాజశేఖర్ తెరకెక్కించిన మిస్ యు సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
"""/" /
అయితే రిలీజ్ కు ముందు కోలీవుడ్ లో మూవీపై మోస్తరు బజ్ ఏర్పడినప్పటికీ.
టాలీవుడ్ లో ఎలాంటి హైప్ లేదు.కానీ రొమాంటిక్ జోనర్ లో వచ్చిన సినిమా కాబట్టి యావరేజ్ హిట్ అవుతుందని అంచనా వేశారు.
కానీ రిజల్ట్ అంతా తలకిందులైంది.కొన్ని రివ్యూలు సినిమా యావరేజ్ అని చెప్పినప్పటికీ వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది.
నాలుగు రోజుల్లో కేవలం మిస్ యు మూవీ రూ.2.
39 కోట్లు వసూలు చేసింది.నాలుగో రోజు రూ.
41 లక్షలు మాత్రమే సాధించింది.దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచేటట్లు కనిపిస్తోంది.
అయితే సిద్ధార్థ్ మూవీపై ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ ఎఫెక్ట్ గట్టిగా పడినట్లు ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
"""/" /
అందుకే రీసెంట్ గా రీ రిలీజైన ఆయన చిత్రాలు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా రాబట్టిన దానిలో సగం కూడా మిస్ యు చిత్రం ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ లో రాబట్టలేదని అంటున్నారు.
అమెరికా తర్వాత అమరావతి అందుకే కామెంట్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.
సిద్ధార్థ్ వ్యాఖ్యలు.బన్నీని( Bunny ) తక్కువ చేసినట్లు ఉన్నాయని, అలాంటి కామెంట్స్ చేస్తే అభిమానులు, సినీ ప్రియులు ఇష్టపడరన్న విషయం గుర్తుంచుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2( Pushpa 2 ) రూ.
1400 కోట్లకు పైగా సాధిస్తే మిస్ యు రూ.2 కోట్లకుగా రాబట్టిందని కంపేర్ చేస్తున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం సిద్ధార్థ్ ఇటీవల మాట్లాడారు.
సినిమాకు, దాని ప్రమోషన్స్ కు ప్రజలు రావడానికి సంబంధం లేదని అన్నారు.ఏ పనులు జరుగుతున్నా చూడడానికి జనాలు వస్తారని, ఊర్లలో ఇల్లు కూల్చడానికి జేసీబీ వచ్చిన చూడడానికి వస్తారని అన్నారు.
దీంతో ఆయన కామెంట్స్ కు అనేక మంది హర్ట్ అయ్యారు.దీంతో ఇప్పటికైనా ఆయన తెలుసుకుంటే బాగుంటుంది.
సిద్ధార్థ తీరు మార్చుకుంటే బాగుంటుంది అంటూ కొందరు హితవు పలుకుతున్నారు.
పెళ్లికి ముందే శోభితకు నాగచైతన్య అలాంటి కండిషన్ పెట్టాడా… వామ్మో?