కియారా కి కండీషన్స్ పెడుతున్న సిద్ధార్థ్..!
TeluguStop.com
హీరోయిన్ గా మంచి ఫాం లో ఉన్నప్పుడు కియారా అద్వానీ తన బోయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్ హోత్రాని పెళ్లి చేసుకుంది.
ఈమధ్యనే వీరిద్దరు ఒకటయ్యారు.బాలీవుడ్ లోనే కాదు సౌత్ సినిమాల్లో కూడా కియరా తన సత్తా చాటుతుంది.
తెలుగులో మహేష్, చరణ్ లతో నటించిన కియరా ప్రస్తుతం చరణ్ 15వ సినిమాకు కూడా పనిచేస్తుంది.
శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.
అయితే పెళ్లి తర్వాత కూడా కియరా సినిమాల్లో కొనసాగించాలని చూస్తుంది. """/" /
భర్త సిద్ధార్థ్ కూడా అందుకు ఓకే అంటున్నాడట కాకపోతే ఒక కండీషన్ పెట్టినట్టు టాక్.
అదేంటి అంటే మ్యాక్సిమం బాలీవుడ్ సినిమాలనే చేయాలని.సౌత్ సినిమాలు అవసరం లేదని చెబుతున్నాడట.
సినిమాలో గ్లామర్ షో విషయంలో కూడా జాగ్రత్త వహించాలని చెప్పాడట.భార్య కాబట్టి ఎక్స్ పోజింగ్ వద్దని చెప్పొచ్చు.
కానీ సౌత్ సినిమాలు వద్దని చెప్పడం ఏంటని కొందరు అంటున్నారు.ఇప్పుడు సౌత్ సినిమాలతోనే నేషనల్ వైడ్ గా హీరోయిన్స్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు.
మరి సిద్ధార్థ్ ఎందుకు అలా నిర్ణయించుకున్నాడో కానీ కియరా ఇక మీదత సౌత్ సినిమాలు చేయదని టాక్.