పెళ్లి తో ఒకటైన హీరోహీరోయిన్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ..

చాలా రోజుల నుంచి హీరో సిద్ధార్థ హీరోయిన్ అదితి రావు హైదరి( Aditi Rao Hydar ) రిలేషన్షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇదివరకు వారిద్దరు వివాహం చేసుకున్నారని అనేక వార్తలు వచ్చాయి.అయితే అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు.

ఇదివరకు హైదరి ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్‌( Siddharth )తో రిలేషన్‌ గురించి అదితి మాట్లాడారు.

‘మహా సముద్రం’ షూట్‌లో తమ మధ్య పరిచయం ఏర్పడిందన్నారు.కొంతకాలానికి అది స్నేహంగా మారిందన్నారు.

తనకెంతో ఇష్టమైన ప్రదేశంలో సిద్ధార్థ్‌ తనకు ప్రపోజ్‌ చేశాడని చెప్పారు.ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ అదితి ఫోటోలను షేర్ చేస్తూ తన వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది.

వీరి వివాహం సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" / సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో వివాహం జరిగింది.

ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితి పెళ్లి జరిగింది.

తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన హీరోహీరోయిన్స్ సిద్ధార్థ్, అదితి.

" నా సూర్యుడు నువ్వే.నా చంద్రుడు నువ్వే.

నా నక్షత్రాలన్నీ నువ్వే” అంటూ అందమైన క్యాప్షన్ తో సిద్ధార్థ్ పై ప్రేమను వ్యక్తం చేసింది అదితి.

ప్రస్తుతం సిద్ధార్థ్, అదితి పెళ్లి ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. """/" / ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు.వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు.

వివాహం సంబంధించిన ఫోటోలను ఇక్కడ చూసేయండి.

ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?