బుల్లితెర షోకి జంటగా వచ్చిన సిద్ధార్థ్ అదితి… వైరల్ అవుతున్న డేటింగ్ రూమర్స్!
TeluguStop.com
తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా పాపులర్ అయినటువంటి వారిలో నటుడు సిద్ధార్థ్( Siddharth ) నటి అదితి రావు హైదరి ( Aditirao Hydari ) జంట ఒకటి అని చెప్పాలి.
వీరిద్దరూ కలిసి మహాసముద్రం ( Mahasamudram ) అనే సినిమాలో నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ వీరు మాత్రం ఆ వార్తలను ఖండించే ప్రయత్నం అస్సలు చేయలేదు.
ఇక నటి అదితి కోసం సిద్ధార్థ్ ఏకంగా ముంబై షిఫ్ట్ కావడం గమనార్హం.
ఇలా వీరిద్దరూ చట్టపట్టాలేసుకొని పెద్ద ఎత్తున ముంబై వీధులలో సందడి చేస్తూ మీడియా కంట పడుతున్నారు.
"""/" /
ఇలా ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్తూ తమ మధ్య ఏమీ లేదని విధంగా వీరి వ్యవహారం ఉందని చెప్పాలి.
అయితే ఇలా వీరిద్దరూ జంటగా కనిపించిన ప్రతిసారి వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
సిద్ధార్థ్ అదితి డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.గత కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ జంటగా నటుడు శర్వానంద్ ( Sharwanand ) వివాహానికి హాజరై సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే సిద్ధార్థ్ తాజాగా టక్కర్(Takker) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా జూన్ 9వ తేదీ తెలుగు తమిళ భాషలలో విడుదల కానుంది అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా ఈయన నటి అదితితో కలిసి సందడి చేశారు.
"""/" /
స్టార్ మా లో సరికొత్తగా ప్రసారం కాబోతున్న నీతోనే డాన్స్( Neethone Dance ) అనే కార్యక్రమం ఈ ఆదివారం చాలా ఘనంగా ప్రారంభం కాబోతోంది.
శ్రీముఖి ( Sreemukhi) వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సీనియర్ నటి రాధా( Radha ) కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్(Tarun Master), నటి సదా (Sadha)న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.
ఇక ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6 గంటలకు చాలా ఘనంగా ప్రారంభం కాబోతోంది.
అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ కార్యక్రమానికి నటుడు సిద్ధార్థ్, అదితి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇలా వీరిద్దరి వేదిక పైకి రాగానే శ్రీముఖి మీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అంటూ ప్రశ్నించడంతో చూడండి నేను మీ ప్రోగ్రాంకు వచ్చాను మా ఊర్లో అందరూ అదితి దేవోభవ అంటారు అంటూ ఈయన చెప్పడంతో ఒక్కసారిగా వేదిక మొత్తం కేకలతో హోరెత్తిపోయింది ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా ఈ కార్యక్రమానికి వీరిద్దరూ జంటగా వెళ్లడంతో వీరిద్దరూ గురించి మరోసారి వార్తలు చర్చనీయాంశంగా మారాయి.
చిరంజీవి లైనప్ లో చేరిన మరో స్టార్ డైరెక్టర్…