ఏడో తరగతిలోనే ఏఐ కంపెనీలు.. ఈ విద్యార్థుల సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!
TeluguStop.com
చిన్న వయస్సులోనే పిల్లలు కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తే తల్లీదండ్రుల ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.
సిద్దార్థ్,( Siddarth ) సౌమ్య( Sowmya ) కవల పిల్లలు కాగా 14 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ పిల్లలు తమ ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.
హైదరాబాద్ రామాంతపూర్ లో పుట్టిన సిద్దార్థ్, సౌమ్య తర్వాత తల్లీదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు.
ప్రస్తుతం సిద్దార్థ్, సౌమ్య తొమ్మిదో తరగతి చదువుతున్నారు.చిన్న వయస్సులోనే ఏఐలో( AI ) ప్రావీణ్యం సంపాదించిన సిద్దార్థ్, సౌమ్య ఏడో తరగతి చదువుతున్న సమయంలోనే చెరో కంపెనీ స్థాపించి ప్రశంసలు అందుకుంటున్నారు.
గ్లోబల్ ఏఐ సదస్సులో( AI Global Summit ) పాల్గొనడానికి సిద్దార్థ్, సౌమ్య పాల్గొనడానికి వచ్చి తమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించడం జరిగింది.
ఏడు సంవత్సరాల వయస్సులోనే సిద్దార్థ్ కు కోడింగ్ పై ఆసక్తి ఏర్పడగా లింక్డిన్ లెర్నింగ్, యూట్యూబ్ ద్వారా సిద్దార్థ్ వేర్వేరు లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు.
"""/" /
ఒరాకిల్, ఆర్మ్ నుంచి మిషన్ లెర్నింగ్, ఏఐపై సిద్దార్థ్ ప్రావీణ్యం సంపాదించాడు.
అతిచిన్న వయస్సులో ఏఐలో సర్టిఫైడ్ అయిన సిద్దార్థ్ స్టెమ్ ఐటీ( STEM IT ) పేరుతో కంపెనీని స్థాపించాడు.
సిద్దార్థ్ సొంతంగా అల్గారిథమ్ లు రాస్తూ ఏఐ ఆధారిత ఉత్పత్తులను రూపొందిస్తున్నాడు.సిద్దార్థ్ రూపొందించిన వాటిలో వృద్ధుల కొరకు చేసిన ఫాల్ డిటెక్షన్ బ్యాండ్, ఏఐతో పని చేసే ప్రోస్థటిక్ హ్యాండ్ బాగా ప్రాచుర్యం పొందాయి.
"""/" /
మరోవైపు సౌమ్య సైతం డ్రైవ్ ఇట్( Drive IT ) అనే సంస్థను మొదలుపెట్టి ఈ ఫ్లాట్ ఫాం ద్వారా లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకుంటే నెల లేదా వారంలో అపాయింట్ మెంట్లు లభించేలా చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటివరకు ఏకంగా 10,000 మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం గమనార్హం.సిద్దార్థ్, సౌమ్య సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీళ్లిద్దరి టాలెంట్ ను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.
30 రోజులు నిద్ర లేదు నరకం అనుభవించాను.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్!