ఆగవయ్యా 'ఆమంచి' ! బుజ్జగిస్తున్న టీడీపీ

టీడీపీలో కొనసాగుతున్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ పార్టీ మారబోతున్నారు అనే విషయం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంతుండడం టీడీపీ కి మింగుడుపడడంలేదు.

బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కలవబోతున్నారని.ఆ తరువాత ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోటం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన్ను బుజ్జగించేందుకు టీడీపీ పెద్దలు కొంతమంది రంగంలోకి దిగిపోయారు.ఆమంచి కృష్ణమోహన్‌ను బుజ్జగించేందుకు మంత్రి శిద్దా రాఘవరావు బాబు ఆదేశాల మేరకు బిజ్జగించేపనిలో పడ్డారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఓవైపు కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సమావేశమై పార్టీ మారే విషయంలో కార్యకర్తల అభిప్రాయం సేకరిస్తుండగా.

మరోవైపు ఆమంచిని కలిసిన మంత్రి శిద్దా రాఘవరావు.తెలుగుదేశం పార్టీలో కొనసాగాలని కోరారు.

ఈ సందర్భంగా పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందులను శిద్దా రాఘవరావు దృష్టికి తీసుకెళ్లారు ఆమంచి.

అనంతరం సీఎం చంద్రబాబుతో మంత్రి శిద్దా రాఘవరావు ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది.అయినా ఆమంచి మాత్రం మెత్త బడినట్టు కనిపించలేదు.