క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ఐ సురేష్ కుమార్

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం సపావత్ తండాలో శ్రీ దత్తాత్రేయ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను తిరుమలగిరి (సాగర్) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సురేష్ కుమార్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని అన్నారు.

గ్రామాలలో క్రీడల పోటీలు నిర్వహించడం వల్ల యువతలో ఐక్యత పాటు నైపుణ్యతను కూడా కలిగిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ హరి ముని నాయక్,ఉపసర్పంచ్ బిక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరోసారి ఆస్కార్‌ లిస్ట్‌లో రాజమౌళి ఆర్ఆర్ఆర్.. ఏ కేటగిరీలో చేరిందో మీకు తెలుసా?