గుంటూరులో ఎస్ఐ ఎంపిక రన్నింగ్ టెస్టులో అపశృతి

గుంటూరు జిల్లాలో నిర్వహించిన ఎస్ఐ ఎంపిక రన్నింగ్ టెస్టులో అపశృతి నెలకొంది.టెస్టులో భాగంగా పరిగెత్తుకుంటూ ఓ యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు.

వెంటనే గమనించిన సిబ్బంది అపస్మారక స్థితికి వెళ్లిన యువకుడిని జీజీహెచ్ కు తరలించారు.

అయితే అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కాగా మృతిచెందిన యువకుడు అంకిరెడ్డిపాలెంకు చెందిన మోహన్ గా గుర్తించారు.

మోహన్ అంకిరెడ్డిపాలెంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు.దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ కాంబోలో పటాస్ 2 ఉంటుందా..?