మట్టిపల్లి సైదులుపై ఎస్ఐ దాడి చేయడం అమానుషం…!

సూర్యాపేట జిల్లా:మోతె మండలం( Mothey Mandal ) విభలాపురంలో శుక్రవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికలోని అవకతవకలను అరికట్టాలని,అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని ఆందోళన చేస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు( Mattipally Saidulu ) మరియు రైతు సంఘం నాయకులు గోపాల్ రెడ్డి,సంఘం నాయకులపైన పోలీసులు మూకమ్మడిగా దాడి చేయడం అమానుషమని,ఇదేనా తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తెలంగాణ గొర్రెల మేకల పెంపక దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మోతె మండలం విభలాపురం డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపిక అధికారులు ఏకపక్షంగా చేశారని,అర్హులైన పేదలకు అందటం లేదని లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు.

సామరస్యంగా ఆందోళన చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల పైన పోలీసులు దాడి చేయడం అన్యాయమన్నారు.

స్థానిక బీఆర్ఎస్ నాయకుల ప్రోత్సాహం తోనేనని ఆరోపించారు.వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల పైన పెట్టిన అక్రమ కేసును ఎత్తు వేయాలని,అర్హులైన పేదల లిస్టు ఫైనల్ చేసి,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కంచుగొట్ల శ్రీనివాస్,సూర్యాపేట పట్టణ కార్యదర్శి గోపనబోయిన రవి జిల్లా నాయకులు చింతల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

టీమిండియా విక్టరీ చూసి పూనకంతో ఊగిపోయిన మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?